కేజీబీవీ నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి

జీతాలు పెంచాలి : ఐఎఫ్‌టీయూ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)ల్లో పనిచేస్తున్న నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి జీతాలను పెంచాలని ఐఎఫ్‌టీయూ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ప్రగతిశీల కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల నాన్‌ టీచింగ్‌, వర్కర్స్‌ అసోసియేషన్‌ (ఐఎఫ్‌టీయూ అనుబంధం) అధ్యక్షులు ఎస్‌ఎల్‌ పద్మ, ప్రధాన కార్యదర్శి అరుణ్‌కుమార్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర కనీస వేతనాల జీవో ప్రకారం వారికి రూ.18 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కేజీబీవీలకు అంబులెన్స్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. పోషక విలువలతో కూడిన ఆహారం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన నిధులను కేటాయించాలని సూచించారు.

Spread the love