గూర్‌గావ్ : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీ సామ్‌సంగ్ కొత్తగా తన గెలాక్సీ సీరిస్‌లో ఎఫ్54 5జిని విడుదల చేసింది. 108 ఎంపి కెమెరా, రెండు రోజుల బ్యాటరీ లైఫ్, సాఫ్ట్‌వేర్ పొడిగింపు మద్దతుతో దీన్ని అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. 6.7 అంగుళాల డిస్‌ప్లే కలిగిన ఈ ఫోన్ ధరను రూ.29,999గా నిర్ణయించింది. 8జిబి ర్యామ్, 256 జిబి స్టోరే జీ, 6000 ఎంఎహెచ్ బ్యాటరీ, 25వాట్ ఛార్జింగ్ తదితర ఫీచర్లను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 778 జి ప్రాసెసర్, 108 ఎంపి, 8ఎంపి అల్రా వైడ్ కెమెరా, 2ఎంపి కెమెరా సహా సెల్ఫీ కోసం 32 ఎంపి కెమెరాను అమర్చారు.