కౌంటింగ్ సెంటర్ ను సందర్శించిన జనరల్ అబ్జర్వర్..

నవతెలంగాణ – డిచ్ పల్లి
నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గ సాధారణ ఎన్నికల పరిశీలకులు ఎలిస్ వజ్ ఆర్ గురువారం ఓట్ల లెక్కింపు కేంద్రమైన డిచ్ పల్లి మండలం లోని సీ.ఎం.సీ మెడికల్ కళాశాలను సందర్శించారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోని నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోల్ అయ్యే ఓట్ల లెక్కింపుతో పాటు నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఎన్నికల సామాగ్రి పంపిణీ, స్వీకరణ కూడా సీఎంసీలోనే చేపట్టనున్నారని అధికారులు అబ్జర్వర్ దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూషన్, రిసీవింగ్ సెంటర్లను, ఆయా సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపు గదులు, పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ ల వద్ద చేసిన ఏర్పాట్లు, వసతులను పరిశీలకులు ఎలిస్ వజ్ ఆర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పర్యవేక్షణలో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు అబ్జర్వర్ కు తెలిపారు. ఆమె వెంట జిల్లా కార్మిక శాఖ అధికారి యోహాన్, ఎస్సీ కార్పొరేషన్ ఈ.డీ రమేష్, మెప్మా పీ.డీ రాజేందర్, విజయేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Spread the love