గచ్చిబౌలి లాకప్‌ డెత్‌పై ప్రభుత్వానికి నోటీసులు

lockup-deathనవతెలంగాణ – హైదరాబాద్
గచ్చిబౌలి కస్టోడియల్‌ డెత్‌ అత్యంత బాధాకరమైన ఘటన అని, ఆందోళన కలిగిస్తోందని హైకోర్టు గురువారం వ్యాఖ్యానించింది. సమాధానం ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు పంపించింది. నానక్‌రాంగూడలోని ఓ నిర్మాణ కంపెనీలో పనిచేస్తున్న బిహార్‌కు చెందిన నితీశ్‌కుమార్‌ అనే సెక్యూరిటీ గార్డును గచ్చిబౌలి పోలీసులు విచారణ పేరుతో పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. మూడురోజులు స్టేషన్‌లోనే ఉంచడంతో చనిపోయాడు. ఈ ఘటనపై పత్రికల్లో వచ్చిన కథనాలను జోడిస్తూ న్యాయవాది రాపోలు భాస్కర్‌ హైకోర్టుకు లేఖరాశారు. దీనిని సుమోటోగా స్వీకరించిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వివరణివ్వాలని హోంశాఖ, డీజీపీ తదితరులకు నోటీసులు జారీచేసింది.

Spread the love