జలశక్తి అభియాన్‌తో భూగర్భజాలలు వృద్ధి

– జిల్లాలో జలశక్తి అభియాన్‌ కేంద్ర
– నోడల్‌ బృంద సభ్యుల పర్యటన
– బృందానికి అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌
– పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
జలశక్తి అభియాన్‌తో జిల్లాలో భూగర్భజాలల వృద్ధిరేటు పెరిగిందని జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా సందర్శనకు వచ్చిన జలశక్తి అభియాన్‌ కేంద్ర నోడల్‌ బంద సభ్యులు అంకిత్‌ మిశ్రా, డిప్యూటీ సెక్రటరీ, అంకిత్‌ విశ్వకర్మ, సైంటిస్ట్‌ జిల్లా యంత్రాంగం తరపున అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ జిల్లాకు ఆహ్వానించారు. గ్రామీణ అభివద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ పాల్గొన్నారు. జలశక్తి అభియాన్‌ ద్వారా రంగారెడ్డి జిల్లాలో చేపట్టిన పనులను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ జలశక్తి అభియాన్‌ బందానికి వివరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో జలశక్తి అభియాన్‌ ద్వారా నీటిని నిల్వ ఉంచే ప్రయత్నంలో ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, బోరుబావులు, చెరువుల, చెక్‌ డ్యామ్‌ల నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. నీటి ఒడిసి పట్టి జిల్లాలో వరి పంటలు, పండ్లు, పువ్వులు సాగు చేయుచున్న విధానము బందానికి వివరించారు. జిల్లాలో తాగునీటి, సాగు నీటికి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఉందని తెలిపారు. జిల్లాలో 558 గ్రామ పంచాయతీలలో హరిత హారం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటి సంరక్షణ చేస్తూ పచ్చదనం పెంచడం జరుగుతుందన్నారు. గ్రామ నర్సరీలు, పల్లె ప్రకతి వనాలు, బహత్‌ పల్లె ప్రకతి వనాలు ఏర్పాటు చేసి పచ్చదనం పెంపొందించడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివద్ధి శాఖ అధికారి ప్రభాకర్‌, అడిషనల్‌ పీడీ నీరజా, వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, మిషన్‌ భగీరథ, ఇరిగేషన్‌ శాఖ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love