– బిల్కిస్ బానో కేసులో గుజరాత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీం
కొద్దిమందికే శిక్ష ఎలా తగ్గిస్తారు ?
న్యూఢిల్లీ : గోద్రా అల్లర్ల సమయంలో సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానో కేసులోని 11మంది దోషులను ముందుగానే విడుదల చేయడంలో గుజరాత్ ప్రభుత్వం అనుసరించిన ‘ఎంపిక’ విధానాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇది ‘చాలా సున్నితమైన, ముప్పుతో కూడిన పరిస్థితి’ అని హెచ్చరించింది. ‘ఎంపిక చేసిన కొద్దిమందికే శిక్ష తగ్గింపు విధానాన్ని ఎందుకు అమలు చేశారు? జైల్లోని వారికి ఈ చట్టాన్ని ఎలా వర్తింపచేస్తారు? మన జైళ్ళు ఎందుకు కిక్కిరిసి వున్నాయి? ముఖ్యంగా అండర్ ట్రయల్స్ విషయ ంలో?” అని జస్టిస్ బి.వి.నాగరత్న ప్రశ్నించారు. బిల్కిస్ బానోపై లైంగికదాడి జరిపి, వారి కుటుంబాన్ని చంపేసిన వారిని ఇలా అకాలంలో విడుదల చేయడ ంపై దాఖలైన పిటిషన్లను జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన బెంచ్ విచారించింది. 11మంది దోషుల విడుదలను గుజరాత్ ప్రభుత్వం సమర్ధిస్తోంది. హేయమైన నేరానికి పాల్పడిన వ్యక్తి తనను తాను సంస్కరిం చుకోవడానికి అవకాశం ఇవ్వద్దా అంటూ గుజరాత్ ప్రభుత్వం ప్రశ్నించిన నేపథ్యంలో బెంచ్ పై ప్రశ్నలు సంధించింది. ‘అసలు ఈ శిక్ష తగ్గింపు ప్రయోజనమేమిటి?’ అని రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదిస్తున్న అదనపు సొలిస ిటర్ జనరల్ ఎస్.వి.రాజుని బెంచ్ ప్రశ్నించింది. దోషులు 14 ఏండ్ల పాటు కఠినమైన శిక్షను పూర్తి చేసుకున్నారని, అది సరిపోతుందని ఏఎస్‌జీ వాదించా రు. పైగా సుదీర్ఘమైన ఆ శిక్షా కాలంలో నేరం చేసిన వ్యక్తిలో సంస్కరణ రావడానికి అవకాశం వుంటుందని రాజు పేర్కొన్నారు. పైగా జైల్లో వారి ప్రవర్త న, బెయిల్‌పై బయటకు వచ్చినప్పటి వ్యవహార శైలి ఇవన్నీ చూసినట్లైతే తాము చేసింది తప్పని సదరు దోషులు గ్రహించారని రుజువు చేస్తున్నాయని పేర్కొ న్నారు. ఎంపిక చేసిన కొద్దిమందికే ఈ విధానాన్ని ఎందుకు వర్తింపచేస్తున్నా రని బెంచ్ ప్రశ్నించగా, దీనికి సమాధానం ఇవ్వడం కష్టమని రాజు అంగీకరించారు.” కేసు సంబంధించిన వాస్తవాల ప్రాతిపదికన సమాధానమి వ్వగలను.రాష్ట్రాలవారీగా గణాంకాలు మీకు ఇవ్వాల్సి వుంది. కేవలం కొద్దిమం ది ఖైదీలే కాదు, ప్రతి ఖైదీకి మారేందుకు అవకాశం ఇవ్వడుతుందన్నారు.