హుండీ ఆదాయం రూ.1 కోటి 5 లక్షలు

నవ తెలంగాణ-కొమురవెల్లి
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు నిర్వహించగా హుండీ ఆదాయం రూ.1 కోటి 5 లక్షల 83 వేల 558 వచ్చింది. గురువారం కొము రవెల్లిలోని ఆలయ ముఖ మండపంలో ఆలయ ఈఓ బాలజీ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ సందర్బంగా మల్లన్న స్వామికి 59 రోజులలో హుండీలలో భక్తులు సమర్పించిన నగదు రూ.1 కోటి 5 లక్షల 83 వేల 558, విదేశి కరెన్సీ నోట్లు 27, మిశ్రమ బంగారం 68 గ్రాములు, మిశ్రమ వెండి 11కిలోల 100 గ్రాములు, పసుపు బియ్యం 18 క్వీంటాళ్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అనంతరం ఈఓ బాలాజీ మాట్లాడుతూ హుండీ ద్వారా వచ్చిన నగదును స్థానిక బ్యాంక్‌లో జమ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానార్చకులు మహాదేవుని మల్లికార్జున్‌, చైర్మెన్‌ భిక్షపతి, ఆలయ ధర్మకర్తలు, సౌజన్య ఆలయ పోలీస్‌ సిబ్బంది, ఆలయ సిబ్బంది, శివరామకష్ణ సేవ సమితిసభ్యులు తదితరులు పాల్గొన్నారు.
దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలి
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌
నవతెలంగాణ-బెజ్జంకి : సీఎం కేసీఆర్‌ సారథ్యంలో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను గ్రామగ్రామాన అంగరంగ వైభవంగా నిర్వహించాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు, బీఆర్‌ఎస్‌ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ సూచించారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై మండలంలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో ఎమ్మెల్యే రసమయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సుమారు నెల రోజుల పాటు నిర్వహించే దశాబ్ది ఉత్సవాల్లో ప్రతి దినం ఒక పండుగ వాతావరణాన్ని తలపించేల ఏర్పాట్లు చేయాలని ప్రజాప్రతినిధులకు తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీపీ నిర్మల, జెడ్పీటీసీ కనగండ్ల కవిత, ఎఎంసీ చైర్మన్‌ రాజయ్య, ఎంపీడీఓ దమ్మని రాము,నాయిభ్‌ తహసీల్దార్‌ పార్థసారథి, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
నవతెలంగాణ-బెజ్జంకి : మండల పరిధిలోని గుండారం గ్రామానికి చెందిన రొడ్డ లక్ష్మి ఇటీవల మతి చెందారు. గురువారం పీఏసీఎస్‌ చైర్మన్‌ తన్నీరు శరత్‌ రావు మతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం దాచారం గ్రామంలో నిర్వహిస్తున్న పెద్దమ్మ తల్లి ఉత్సవాలకు శరత్‌ రావు హజరై దర్శించుకున్నారు. నాయకులు పోచయ్య, చెన్నారెడ్డి తదితరులు హజరయ్యారు.

Spread the love