కహానీ కమలం

‘పొద్దున లేస్తే చాలు. ఆ మతం ఇట్ల జేసింది. ఈ మతం అట్ల జేస్తోంది. వాటి వల్ల మన మతం ఆగమాగమైపోతుంది. మనం కలిసి ఉండాలే. లేకపోతే మన మతానికే ముప్పు వస్తుంది.’ ఇలా నిత్యం రెచ్చగొట్టే మాటలు చెప్తరు. వారి యవ్వారం చెప్పేటోనికి వినేవాళ్లులోకువ అన్నట్టు ఉంది. రాష్ట్రంలో అయితే పాత బస్తీపై పడి ఏడుస్తరు. దానిపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తామని రెచ్చగొడతారు. ప్రతిరోజు పాత బస్తీ ఉగ్రవాదులకు అడ్డా మారింది అని అంటరు. ఎంతో కోపంతో ఊగిపోతరు. బీజేపీ నేతలు బండి సంజరుకుమార్‌, అర్వింద్‌కుమార్‌, రాజాసింగ్‌, కిషన్‌రెడ్డి ముందు వరసలో ఉంటారు. అక్కడ ఎంఐఎంను ఓడించేందుకు వారి దగ్గర మాత్రం ప్లాన్‌లేనట్టుంది. ఐదేండ్లకోసారి బీజేపీ తరుపున ఎవరో ఒకర్ని అక్కడ పోటీకి నిలబెడతారు. కానీ వీళ్లు మాత్రం అక్కడ పోటీచేయరు. కనీసం ఈసారైనా హైదరాబాద్‌ పార్లమెంటు స్థానంలో వారిలో ఎవరో ఒకరు పోటీ చేస్తారని కమల శ్రేణులు ఎంతో ఆశగా ఎదురు చేశారు. వారి నమ్మకాన్ని ఈసారి కూడా నిలబెట్టుకోలేదు. అదే బండి సంజరు మళ్లీ కరీంనగర్‌లో పోటీకి దిగుతున్నరు. అర్వింద్‌ నిజామాబాద్‌లో, కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌లో పోటీ చేస్తున్నరు. హైదరాబాద్‌లో మాత్రం పోటీ చేయరు. ఎందుకంటే అక్కడ నుంచి పోటీ చేస్తే అరణ్యవాసం తప్పదనే భయం. మతం లేదు, గితం లేదు. వారికి సీటు మాత్రమే కావాలి. అక్కడ టికెటిచ్చామంటే, ఇచ్చాం అనిపించుకుంటారు. వారి ఉరుములు, మెరుపులు రాజకీయం కోసమే తప్ప ప్రజల కోసం కాదు. నిజంగా ధైర్యముంటే, మీ మాటలకు విలువ ఇచ్చి ఉంటే, మీలో ఎవరో ఒకరు హైదరాబాద్‌ పార్లమెంటు స్థానంలో పోటీ చేయాలంటూ మీ అభిమానులే అడుగుతున్నారు. లేకపోతే మీరు చెప్పేవన్నీ కహానీ అని అనుకుంటరు.
– గుడిగ రఘ

Spread the love