జర్నలిస్టులకు నివాసయోగమైన స్థలాన్ని కేటాయించడానికి సిఎం కి లేఖ

– నిజామాబాద్ నగర రాసిన సీనియర్ జర్నలిస్ట్ జమాల్పూర్ గణేష్
నవతెలంగాణ కంటేశ్వర్
తెలంగాణా కోసమే తెలంగాణ జర్నలిస్టుల నే నినాదాన్ని ఎత్తుకుని మీతో కలిసి నడిచిన తెలంగాణ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి రాకెట్ స్పీడ్ లో మీరు చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం. అయితే నిజామాబాద్ నగర జర్నలిస్టుల కు అనువైన, నివాస యోగ్యం అయ్యే స్థలాలను మాత్రమే ఇవ్వమని కోరుతున్నాం.. నగరానికి చుట్టుపక్కల కాకుండా గుండారం గుట్టను చదును చేసి ఇస్తామంటూ ఇతర ప్రత్యామ్నాయ స్థలాన్ని పరిశీలించడానికి జిల్లా యంత్రాంగం ఆసక్తి చూపడం లేదు.. ఎట్టి పరిస్థితుల్లో అయినా గుండారం గుట్టల్లోనే జాగా ఉందని మా సహచరులను, ప్రజాప్రతినిధులను తప్పుదోవ పట్టిస్తున్నారు. గుండారం గుట్టల జాగకు ప్రత్యామ్నాయముగా సారంగపూర్ లోని 231 సర్వేనంబర్లోని 10.08 ఎకరాల స్థలాన్ని జర్నలిస్టులకు ఇప్పించాలని మనవి.. నగర శివారులో జనావాసాలు దగ్గర ఉన్న ఈ భూమిను ఒక రియలేస్టేట్ వ్యాపారి చదును చేసి ప్లాట్లుగా అమ్ముకున్న తరువాత అధికార యంత్రాంగం ఈ భూమిను స్వాధీనం లోకి తీసుకున్నారు.. ఎలాంటి లిటికేషన్లు లేని ఈ10 ఎకరాల 8 గుంటల భూమిని కనుక కేటాయిస్తే వెంటనే జర్నలిస్టుల ఇండ్లు కట్టుకోవడానికి సులభం అవ్వుతుంది.. ఈ శిఖం ఇపుడు డిఫంక్డ్ అయ్యింది.. ఈ కేటగిరి భూమిని 30 ఎకరాలను శిఖం నుండి తొలగించి ఖమ్మం జర్నలిస్టులకు ఇచ్చిన మీకు సారంగపూర్ భూమిని క్లియర్ చేయడం చిటికెలో పని.. సారంగపూర్ స్థలాన్ని ఇప్పించి నిజామాబాద్ నగర జర్నలిస్టుల గుండెల్లో గూడు కట్టుకుంటారని సీనియర్ జర్నలిస్ట్ జమాల్పూర్ గణేష్ ఆశిస్తున్నారు. ఇళ్లస్థలాలకై దీని ప్రతులు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కు అందజేశామన్నారు.

Spread the love