మణిపూర్ దుండగులను కఠినంగా శిక్షించాలి : టీఎస్ యూటీఎఫ్

నిరసన ర్యాలీ చేస్తున్న ఉపాద్యాయ సంఘం నాయకులు
నిరసన ర్యాలీ చేస్తున్న ఉపాద్యాయ సంఘం నాయకులు

నవతెలంగాణ-మంగపేట: మణిపూర్ రాష్ట్రంలో మహిళలపై హింసించి హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ పెడరేషన్ జిల్లా అద్యక్షుడు గొప్ప సమ్మారావు డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో సంఘం సభ్యులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టి మాట్లాడారు. మణిపూర్ మహిళలపై అఘాత్యాలు చేసి హత్య చేసిన దోషులు ఎంటివారైనా ప్రభుత్వం కఠినంగా శిక్షించి మణిపూర్ లో శాంతియుత పరిస్థితులు నెలకోల్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీలు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయం వద్ద 17 రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు సంఘీభావం ప్రకటించి నిరసననలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి పోడెం సమ్మయ్య, జిల్లా కార్యదర్శి ములుకాల వెంకటస్వామి, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి గుండం పురుషోత్తం, శ్రీరాముల సతీష్, ఉపాధ్యాయులు మోడెం హన్మంతరావు, తల్లడి నాగేశ్వరరావు, టి.నాగమ్మ, డి.విజయ, కె.దీపిక, అస్మా బేగం, కె.నాగభూషణంలు పాల్గొన్నారు.

గ్రామపంచాయతీ కార్మికులకు సంఘీభావం
గ్రామపంచాయతీ కార్మికులకు సంఘీభావం
Spread the love