ఎంబీఏ ఛాయ్ వాలా

ప్రఫుల్‌ బిల్లోర్‌ అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ.. ‘ఎంబీఏ ఛాయ్ వాలా’ అంటే సోషల్‌ మీడియాలో యాక్టివ్‌?గా ఉండే చాలా మందికి తెలుసు. సొంత పేరు కంటే.. ఆయన స్థాపించిన ‘ఎంబీఏ ఛాయ్ వాలా’ అంతలా ఫేమస్‌ అయింది.
ఛాయ్ వ్యాపారమే ధనవంతుడిని చేసింది. రోజుకు రూ.150 సంపాదన నుంచి కోటీశ్వరుడిని చేసింది. ఈ ఛారువాలా ఇప్పుడు అతడు ఎంతో మందికి స్ఫూర్తి. తన కాళ్ల మీద తను నిలబడటమే కాదు, మరికొంతమంది యువతకు ఉపాధి కల్పిస్తున్నాడు. ఆత్మ గౌరవతో బతికే ఒక మార్గం చూపుతున్నాడు.

ఛారుతో కోట్లాదిపతి అయిన ప్రఫుల్‌ స్టోరీ లోకి వెళ్లితే…
భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో విస్తృత ఉనికి కలిగిన కేఫ్‌గా ‘ఎంబీఏ ఛాయ్ వాలా’ను నిలపాలి. ఇది మా ప్రధాన లక్ష్యం. అదే సమయంలో కొన్ని మిలియన్ల మంది ప్రజలను చేరుకోవడం, వారికి ఇలాంటి వ్యాపారాలపై నమ్మకం కల్గించడం. ఇలాంటి ఆలోచనను పెంపొందించడం. మా బ్రాండ్‌ను ప్రజలకు అందించడం. ఆసక్తి ఉన్న వారిని మాతో కలుపుకొని క్రమంగా మా వ్యాపారిన్ని విస్తరించడంతో పాటు, మరి కొంతమంది యువకులను యజమానులగా తమ కాళ్లపై తాము నిలబడగలమని నమ్మకం కల్గించడం తద్వారా.. ప్రగతిశీల దేశాన్ని నిర్మించడానికి నావంతు దోహదపడటం. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో వ్యూహాత్మకంగా ఉన్న 200 అవుట్‌లెట్‌లతో, మేము మా ప్రస్తుత విజయాలను అధిగమించడానికి మరింత ఎక్కువ ప్రభావాన్ని చూపడానికి కట్టుబడి ఉన్నాము.
ఎగ్జామ్‌ ఫెయిలవడంతో ‘టీ స్టాల్‌’
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని ధార్‌ జిల్లాలో జనవరి 14, 1996న జన్మించిన ప్రఫుల్‌, తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించే ముందు ఐఐఎం అహ్మదాబాద్‌ నుంచి మాస్టర్స్‌ డిగ్రీని పొందాలని అనుకున్నాడు. ఎంబీఏలో చేరేందుకు తప్పనిసరిగా CAT పరీక్షలో మంచి ర్యాంక్‌ అవసరం. ఇందుకోసం రోజుకు 10 గంటలకు పైగా కష్టపడ్డాడు. కానీ.. కష్టానికి తగిన ఫలితం రాలేదు. మూడు ప్రయత్నాల్లోనూ విజయం సాధించలేకపోయాడు. తల్లిదండ్రుల సహకారం ఉన్నప్పటికీ డిప్రెషన్‌కు గురైన ప్రఫుల్‌ దేనిపైనా దష్టి పెట్టలేకపోయాడు. అదే జీవితం కాదని అని తనకు తనే ధైర్యం చెప్పుకొని మరోవైపు అడుగులు వేశాడు. తాను ఏ క్యాంపస్‌ లో సీటు సాధించలేకపోయాడో, అదే క్యాంపస్‌ ముందు కేవలం రూ.8,000 పెట్టుబడితో ఐఐఎం అహ్మదాబాద్‌ క్యాంపస్‌ వద్ద జూలై 25, 2017న టీ స్టాల్‌ ఓపెన్‌ చేశాడు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మెక్‌డొనాల్డ్స్‌లో పనిచేయడం. సాయంత్రం తన టీ స్టాల్‌ నడపడం.. అది అతని దినచర్యగా మారింది. అతని కస్టమర్‌ బేస్‌ పెరగడంతో పక్క టీ స్టాల్‌ వాళ్లు అతని విజయాన్ని చూసి అసూయపడ్డారు. వారు యూనియన్‌గా ఏర్పడి ప్రఫుల్‌ షాప్‌ తీయించి వేశారు. దీంతో మరింత కసి పెరింది. విజయం సాధించాలన్న పట్టుదల మరింత పెరిగింది. మరో రూ.పదివేలు పెట్టుబడి పెట్టి కొత్త టీ స్టాల్‌ని ఏర్పాటు చేసి తన వ్యాపారాన్ని పునఃప్రారంభించాడు.
మొదటి రెస్టారెంట్‌..
ప్రఫుల్‌ బిల్లోర్‌ చాలా కాలం తర్వాత తన సొంత రెస్టారెంట్‌ ఎంబిఏ చారువాలాను ప్రారంభిం చాడు. వీదీA అంటే 14, 1996′ అని అర్థం. ఎంబీఏ ఛారు వాలా.. అనే పేరు డిఫరెంట్‌గా ఉండటంతో సోషల్‌ మీడియాలో ఇది వైరల్‌ అయింది. ఈ సక్సెస్‌ స్టోరీ ఇంటర్నెట్‌లో సంచలనం సష్టించింది. ప్రఫుల్‌ బిల్లోర్‌ వ్యక్తిగత వెబ్‌సైట్‌ను కూడా నిర్వహిస్తున్నారు. ఇతను ముఖ్యంగా ఐఐఎం అహ్మదాబాద్‌ ఎంబీఏ విద్యార్థులకు సుపరిచితుడు. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌ కావటంతో అంతర్జాతీయ ప్రాముఖ్యతను పొందాడు. కొన్ని నెలల్లోనే అతని కంపెనీ నెలకు మిలియన్‌ డాలర్లను సంపాదించటం ప్రారంభించింది. కొన్ని నెలల్లోనే అతని కంపెనీ నెలకు మిలియన్‌ డాలర్లను సంపాదించటం ప్రారంభించింది. రోజుకు రూ.150 సంపాదన నుంచి అతడి వ్యాపారం కూడా క్రమంగా విస్తరించింది. చాలా ఔట్‌?లెట్లు ఓపెన్‌ అయ్యాయి. 2019-20 సంవత్సరంలో ఎంబీఏ ఛారు?వాలా టర్నోవర్‌ రూ.3కోట్లకు చేరింది.
50 సిటీలు.. 200 ఔట్‌లెట్లు
సాధారణంగా ఎంబీఏ అంటే మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌. అయితే ఈ ‘ఎంబీఏ ఛారు వాలా’లో ఎంబీఏ అంటే మిస్టర్‌ బిల్లోర్‌ అహ్మదాబాద్‌ (Billore Ahmedabad). ఎంబీఏ ఛారు వాలా చాలా తక్కువ కాలంలోనే ఫేమస్‌ అయిపోయింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 50 సిటీల్లో 200పైగా బ్రాంచ్‌?లు ఉన్నాయి. ప్రస్తుతం ఎంబీఏ ఛారు వాలా అధినేతగానే కాదు.. మోటివేషనల్‌ స్పీకర్‌గానూ ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నాడు. అంతే కాదు… తన 200 ఔట్‌లెట్లలలో వందల మందికి ఉపాధిని ఇస్తున్నాడు.

Spread the love