‘సంపూర్ణ ఆరోగ్యానికి పాలు మేలు’

       పాలు అంటే ఇష్టపడని వారు ఎవరుండరు. పాలలో మానవుని శరీరానికి కావలసిన ఎన్నో పోషక విలువలు వున్నాయి. చంటి పిల్లల నుండి వృద్దుల వరకు అందరూ ఆరోగ్యంగా ఉండటానికి పాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ వారి సిఫారసు మేరకు ఒక వ్యక్తి ఆరోగ్యంగా వుండాలంటే ప్రతి రోజు 284 గ్రాముల పాలు తీసుకోవాలి. బలవర్ధకమైన ఆహారం పాలు. ప్రతి సంవత్సరం జూన్‌ 1న ప్రపంచ పాల దినోత్సవంని జరుపుతారు. దీన్ని మొట్టమొదటి సారిగా 2001 సంవత్సరంలో ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌.ఏ.ఓ) జరుపుతున్నది. పాలను ప్రపంచ ఆహారంగా పాడి రంగంలో అనుసంధా నించబడినదిగా పాల దినోత్సవాన్ని అనేక దేశాలు జరుపుకొంటున్నాయి. ఆరోగ్యకరమైన ఆహారం, ఆహార ఉత్పత్తి జీవనోపాధికి తోడ్పడే పాడి పరిశ్రమపై అవగాహన కల్పిస్తుంది. సుమారు ఒక బిలియన్‌ పైగా ప్రజలు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రపంచ బాలల దినోత్సవాన్ని వివిధ దేశాల్లో ర్యాలీలు, సమావేశాలు, ఆహార బ్యాంకులకు విరాళాలు, క్రీడలు, పాల ఉత్పత్తుల రుచి ప్రదర్శనలు, సెమినార్లు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ప్రపంచ ఆహారంగా పాల ప్రాముఖ్యతను తెలుపుటకు పాడిరంగాన్ని అభివృద్ధి పరచుటకు ఐక్యరాజ్యసమితి ఆహారం, వ్యవసాయ సంస్థ ప్రపంచ పాల దినోత్సవం జరుపుటకు నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం 22వ వార్షికోత్సవం సందర్భంగా ఆరోగ్యం, పోషణ అన్ని వర్గాలకు ఆహార ఇవ్వడంలో ప్రాధాన్యత ఇస్తున్నారు. పాలు సంపూర్ణ ఆహారం, సహజమైన పదార్థం, పాల నుండి జున్ను, వెన్న, పెరుగు, నెయ్యి, ఐస్‌ క్రీం, కేకు, స్వీటు వంటి పదార్థాలు లభిస్తాయి. పాలు మెగ్నీషియం, కాల్షియం, విటమిన్‌ ఎ, విటమిన్‌ డి,ప్రోటీన్‌, వంటి ఆరోగ్య కరమైన కొవ్వుల వంటి పోషకాలకు, అద్భుతమైన మూలం. పాలు శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. ఎదిగే పిల్లలకు, క్రీడాకారులకు, ఎంతో పోషక విలువలు అందుతాయి. పాలు కండరాల, ఎముకల నిర్మాణానికి అవసర మైన ప్రోటీన్లు క్యాల్షియం, సమృద్దిగా అందిస్తాయి. భారతదేశ గ్రామీణ ప్రజలలో ఉన్న నమ్మకం ప్రకారం పల్లె ప్రజలు కల్తీలేని అసలు సిసలైన స్వచ్చమైన పాలను పొందుతారు కాబట్టి ఆరోగ్యంగా ఉంటారనే విశ్వాసం. పాలు అధిక పోషకాలు గలవి. పేగుల్లో ఆరోగ్య సహాయక సూక్ష్మ జీవుల పెరుగుదలకు సహాయ పడతాయి. పాలలో ఉన్న విటమిన్‌ ఎ, కళ్ళ ఆరోగ్యానికి రక్ష. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ ఆఫ్‌ ఇండియా ప్రకారం పశువుల నుండి స్రవించే స్రావాన్ని పాలు అని పిలుస్తారు అని నిర్వచించారు. దురదృష్ట వశాత్తు ఈ రోజుల్లో స్వచ్చ మైన పాలను పొందడం కష్టంగా ఉంది. పాలలో నీరు ఇతర పదార్థాలను కలిపి అమ్ముతున్నారు. కల్తీ పాలు ఒక మోసపూరితమైన చర్యల ద్వారా తయారుచేసి విక్రయిస్తున్నారు. అయితే పాలు పాల ఉత్పత్తుల నాణ్యతను పరిశీలించటం కోసం నేషనల్‌ డెయిరీ డెవలప్‌ మెంట్‌ బోర్డు అనేది పాలు, పాల పరిమాణాన్ని పరిశీలిస్తువుంది. కానీ దేశంలో ఎక్కువ లేకపోవడం వల్ల వినియోగదారులు నష్ట పోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పాలు, పాల ఉత్పత్తులు తినేవారు సుమారు 600కోట్ల మందికి పైగా ఉన్నారు. భారతీయుల సాంప్రదాయం ప్రకారం భోజనంలో పాల ఉత్పత్తులు తప్పని సరిగా తీసుకుంటారు. పశువుల నుండి లభించే ఈ పాలను బాగా వేడి చేసిన పిదప తాగాలి. అధిక సమయం వేడి చేసినా పోషకాలు కొంత మేర కోల్పోతాం.
పాలలో విటమిన్‌ డి, భాస్వరం, విటమిన్‌ బి12, విటమిన్‌ ఎ, నియాసిన్‌, లాక్టోస్‌, కార్బోహైడ్రేట్స్‌, పొటాషియం, కొవ్వులు, వంటి పోషకాలు లభిస్తాయి. వీటి వలన ఎముకల నిర్మాణం, శక్తి, ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాల ఉత్పత్తి, దృష్టి, చర్మ సంబంధ వ్యాధులు రాకుండా తోడ్పడును. చెక్కర, కొవ్వు పదార్థాలు తయారగును. మానవుడు ఆరోగ్య వంతమైన జీవితానికి దోహదపడును. మధ్యవయస్సు వారు పాలు, పాల ఉత్పత్తులు తక్కువ తీసుకోవాలి. వయస్సు రీత్యా అధిక మోతాదులో తీసుకోవడం వల్ల మొటిమలు, చర్మ సంబంధ వ్యాధులు వస్తాయి. బ్లడ్‌ ప్రెషర్‌, రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది. లాక్టోస్‌ అనే పదార్థం వలన డయాబెటీస్‌, గుండె సంబంధ వ్యాధులు వస్తాయి. పాలలో పిండి పదార్థాలు, డిటర్జెంట్‌ ఫౌడర్‌ మిశ్రమం చేస్తారు. అందుకు మనం పాలను వేడి చేస్తున్నప్పుడు కొన్ని చుక్కల అయోడిన్‌ వేస్తే పాలు నీలం రంగుకు మారితే కల్తీ పాలుగా గుర్తించ వచ్చును. ప్రస్తుతం భారత దేశంలో పాడి సంపద ప్రాధాన్యత తగ్గుతున్నది డెయిరీ పరిశ్రమను అభివృద్ధి చేయాలి. దాంతో ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ప్రాధాన్యత ఉంటుంది. ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి అనుబంధంగా పాడి రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలి. యంత్రాల వినియోగం వల్ల ఈ రంగం ప్రాధాన్యం తగ్గింది. వాస్తవంగా వ్యవసాయానికి సేంద్రీయ ఎరువుల వాడకం తగ్గి క్రిమి సంహారక మందులు ప్రాధాన్యత ఇస్తున్న ఈ రోజుల్లో దిగుబడి తగ్గుతున్నది. అందుకు ప్రభుత్వాలు పాడిరంగానికి ప్రాధాన్యత ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రతి వంద గ్రాముల పాలలో ఆవు పాలు 86.5 శాతం, గేదె పాలు 84.2 శాతం వరకు నీరు కలిగి ఉంటుంది. ఆవు పాలలో కొవ్వు 4.6శాతం, మాంసకృతులు 3.4శాతం, పిండి పదార్థాలు 4.9శాతం, ఖనిజ లవణాలు 0.7 వరకు ఉంటాయి. గేదె పాలలో ఇంచు మించు 6.6శాతం కొవ్వు, 3.9శాతం మాంస కతులు, 5.2శాతం పిండి పదార్థాలు వుంటాయి. నిత్యం పాలు తాగుదాం. ఆరోగ్యంగా ఉందాం.
(నేడు ప్రపంచ పాల దినోత్సవం)
– కామిడి సతీష్‌రెడ్డి
 9848445134

Spread the love