ప్రకృతి వైపరీత్యమా? నిర్లక్ష్యమా?

నవతెలంగాణ – రామగుండం : విలేజ్ రామగుండం 11 కెవి విద్యుత్ వైర్ లైన్ లపై చెట్టుకొమ్మ పడి షాట్ సర్క్యూట్ అయ్యింది. షాట్ సర్క్యూట్ కారణంగా పలు గృహల్లో విద్యుత్ ఉపకరణాలు ధ్వంసం అయినాయి. విద్యుత్ లైన్ ల పై చెట్టుకొమ్మలు వాలిన విద్యుత్ అధికారులు తొలగించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని బాధితులు తెలిపారు. విద్యుత్ లైన్ పై చెట్టుకొమ్మలు వాలాయి అని అధికారులు దృష్టికి పలుసార్లు తీసుకెళ్లిన తొలగించకుండా కాలయాపన చేసి తమకు నష్టం చేకూర్చారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మామిడి సాగర్ ఇంట్లో టివి ఫ్రీజ్, వంత్రి నరేష్ ఫ్రీజ్, మురిఫోజు శరత్ టివి, కిష్టయ్య రెండు ఫ్యాన్ లు, సంతోష్ టీవీ లు ధ్వంసం అయినట్లు పేర్కొన్నారు.అధికారులు చొరవ తీసుకొని తమ నష్టాన్ని భర్తీ చేయాలనీ బాధితులు కోరారు. సంబంధిత ఏ. ఈ ని వివరణ అడుగగా చెట్టు కొమ్మలు తొలగించడానికి ఓ ఇంటి యజమాని అనుమతించట్లేదని ప్రకృతి వైపరీత్యాలకి తాము బాధ్యత వహించామని అన్నారు. అధికారుల నిర్లక్ష్యం :బాధితుడు ప్రతి శనివారం అధికారులు మెయింటనెన్స్ కింద విద్యుత్ నిలిపి వేసిన ప్రయోజనం లేకుండా పోతుంది. లైన్ మెన్ లైన్ ఇన్స్పెక్టర్ ఎప్పటికప్పుడు విద్యుత్ లైన్ లపై ఉన్న చెట్టు కొమ్మలని తొలగించేలా చొరవ తీసుకోవాల్సి ఉన్న నిర్లక్ష్యం వహిస్తున్నారు. చెట్టుకొమ్మ విరిగి మూడు రోజులైనా అధికారులు పట్టించుకోలేదు. అధికారుల నిర్లక్ష్యం వల్ల మా విలువైన విద్యుత్ ఉపకారణాలని నష్ట పోయాము… సాధ్యమైనంత వరకు మా నష్టాన్ని అధికారులు భర్తీ చేయడానికి కృషి చేయాలి.

Spread the love