నవ్వుల్‌ పువ్వుల్‌

Smiles are flowersమగవాళ్ళకు మాత్రమే
ఓ కంపెనీలో అందరూ మగాళ్ళను, అందునా పెళ్ళైన వాళ్ళనే రిక్రూట్‌ చేసుకుంటున్నారు. పైగా ఆడవాళ్ళు అర్హులు కాదంటూ నోటిఫికేషన్‌లో రాయడంతో మండిపడ్డ మహిళా సంఘాలు ధర్నా చేశాయి. అసలు విషయం కనుక్కుంటే ఆ కంపెనీ యజమాని ఒక మహిళ. ఈ విషయం తెలిసిన మహిళా సంఘం నేతలకు మరింత కోపం వచ్చింది. ఆ యజమానిని ఈ విధంగా కోపంగా ప్రశ్నించారు ”ఒక మహిళ అయ్యుండీ ఏమిటా నోటిఫికేషన్‌?”
”అబ్బే… మాకే విపక్షా లేదండి. ఇది ఇప్పుడిప్పుడే పైకొస్తున్న కంపెనీ. చెబితే వినేవాళ్ళు, ఆదేశాల్ని తక్షణం పాటించేవాళ్ళు, కోప్పడ్డా ఎదురుతిరగనివాళ్ళు కావాలి మాకు. అన్నిటికంటే ముఖ్యంగా ఆఫీస్‌ అవర్స్‌ అయిపోగానే తక్షణం ఇంటికి వెళ్ళాలనిపించకూడదు.” అసలు విషయం చెప్పింది అధినేత.
చిన్న-పెద్ద
”మీరు చూస్తే చాలా చిన్న లాయర్లా ఉన్నారు. నా కేస్‌ టేకప్‌ చెయ్యగలరా?” సందేహంగా అడిగాడు క్లయింటు.
”ఫరవాలేదు. మీ కేసు పూర్తయ్యేనాటికి నేను పెద్ద లాయర్నవుతాను” అభయమిచ్చాడు లాయర్‌.
తల వంచదు
పెళ్ళి కొడుకు తండ్రి: ఏమింటండీ..! మావాడిని నుంచుని తాళికట్టమంటున్నారు..!
పెళ్ళికూతురి తండ్రి: అవునండి.. మా అమ్మాయి వాళ్ళ అమ్మలాగే తలవంచదు. నేను నిల్చునే తాళి కట్టాను..!
ధగధగలు
సువర్ణ : సినిమాకు వెళ్ళావు. సినిమా ఎలా వుంది అని అడిగితే చూడలేదంటావేం?
అపర్ణ: ఔను నా పక్కన కూర్చున్నావిడ పెట్టుకొచ్చిన రవ్వల దుద్దులు అంత చీకట్లోనూ ధగధగ మెరుస్తుంటే సినిమా ఎలా చూడగలను చెప్పు..?

Spread the love