స్పై.. సుభాష్‌ చంద్ర బోస్‌ బయోపిక్‌ కాదు

నిఖిల్‌ సిద్ధార్థ్‌ రా ఏజెంట్‌గా నటిస్తున్న చిత్రం ‘స్పై’. గ్యారీ బిహెచ్‌ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ఈడీ ఎంటర్‌ టైన్‌మెంట్స్‌ పై కె రాజశేఖర్‌ రెడ్డి, సిఇఓ చరణ్‌ తేజ్‌ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. సోమవారం న్యూఢిల్లీలోని సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహం కర్తవ్య పథ్‌ వద్ద ‘స్పై’ చిత్ర టీజర్‌ను విడుదల చేసారు. ఈ టీజర్‌ 3 మిలియన్‌ వ్యూస్‌కు చేరుకోవడంతో మంగళవారం స్పై ఫస్ట్‌ మిషన్‌ పేరుతో మీడియాతో చిత్ర బృందం ఇంటరాక్ట్‌ అయ్యింది.
‘సుభాష్‌ చంద్రబోస్‌ గురించి, ఆయన స్థాపించిన ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌, దాని పనులు గురించి చాలామందికి తెలీవు. వినోదంతోపాటు దేశానికి తెలియాల్సిన పాయింట్‌ ఇందులో ఉంది. నేతాజీ సీక్రెట్సే ఈ కథ. అయితే ఇది ఆయన బయోపిక్‌ కాదు’ అని హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ చెప్పారు. ‘జూన్‌ 29న సినిమా చూసి థ్రిల్‌ అవుతారు’ అని దర్శక, నిర్మాతలు తెలిపారు.

Spread the love