మూడో అంతస్తు నుంచి దూకిన డెలివరీబాయ్‌

నవతెలంగాణ – హైదరాబాద్‌: నగరంలోని రాయదుర్గం పీఎస్ పరిధి పంచవటి కాలనీలో విషాదఘటన చోటు చేసుకుంది. సరుకు డెలివరీ చేసేందుకు డెలివరీ బాయ్ మూడో అంతస్తు ఎక్కాడు. ఫ్లాట్‌లో నుంచి డాబర్‌మెన్ కుక్క కరవడానికి రావడంతో యువకుడు భయపడ్డాడు. భయంతో మూడో అంతస్తు నుంచి డెలివరీబాయ్‌ కిందికి దూకేశాడు. ఈ ప్రమాదంలో డెలివరీబాయ్‌కి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ డెలివరీబాయ్‌ని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Spread the love