రావణాసురుడి లక్ష్యం ఏంటి?

రవితేజ, సుధీర్‌ వర్మ కాంబినేషన్‌లో అభిషేక్‌ పిక్చర్స్‌, ఆర్టీ టీమ్‌వర్క్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న హై-ఇంటెన్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘రావణాసుర’ . ఈ సినిమా షూటింగ్‌ ఆదివారంతో పూర్తి అయ్యింది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్‌లో శేఖర్‌ మాస్టర్‌ పర్యవేక్షణలో హీరో, హీరోయిన్లపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం వేసవిలో విడుదలయ్యే క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఒకటి. ఫస్ట్‌ గ్లింప్స్‌ రవితేజ పాత్రని విభిన్న షేడ్స్‌లో చూపించగా, థీమ్‌ నెంబర్‌, రెండవ సింగిల్‌కి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. సుశాంత్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో అనుఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాష్‌, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్‌, పూజిత పొన్నాడ కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రీకాంత్‌ విస్సా ఈ చిత్రానికి సరికొత్త కథని అందించారు. సుధీర్‌ వర్మ తన మార్క్‌ టేకింగ్‌తో ఈ చిత్రాన్ని కథనంలో ఊహించని మలుపులతో స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. ఏప్రిల్‌ 7న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది ఈ చిత్రానికి నిర్మాతలు: అభిషేక్‌ నామా, రవితేజ.

Spread the love