మద్యం షాపులకు 1,31,490 దరఖాస్తులు

– నేడు డ్రా… ఏర్పాట్లు పూర్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మద్యం షాపుల కోసం 1,31,490 దరఖాస్తులొచ్చాయి. 2021లో 68,691 దరఖాస్తులు మాత్రమే వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 1,834 షాపులు (అందరూ పోటీ పడేందుకు వీలుగా ఉన్నవి), 786 షాపులు (రిజర్వ్‌ చేయబడినవి) అంటే మొత్తం 2,620 షాపులకుగాను ఈ దరఖాస్తులు వచ్చినట్టు ఎక్సైజ్‌ శాఖ వెల్లడించింది.నేడు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించబోయే డ్రా కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు.

Spread the love