కార్మికులందరూ ఐక్యంగా పోరాడాలి

– సీఐటీయూ 53 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
నవతెలంగాణ-భద్రాచలం రూరల్‌
సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా భద్రాచల పట్టణంలోని వివిధ కూడళ్లలో సీఐటీయూ పతాకావిష్కరణలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలలో పట్టణ కన్వీనర్‌, కో కన్వీనర్లు ఎం.బి నర్సారెడ్డి, ఎం.రేణుకలు మాట్లాడుతూ 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం, కార్మిక చట్టాలన్నీ తుంగలో తొక్కుతూ, కార్మిక హక్కులను కాలరాస్తూ, 43 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చి కార్మికులను ఇబ్బందులుకు గురిచేస్తున్నదన్నారు. బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని, లేకపోతే రాబోయే ఎన్నికల్లో బిజెపికి సరైన బుద్ధి కార్మికులే చెబుతారని ఈ సందర్భంగా హెచ్చరించారు. సీఐటీయూ 53వ వార్షికోత్సవ సభలను గ్రామపంచాయతీ కార్మికులు, చెన్నుపాటి జీసీసీ హమాలీ కార్మికులు, వీవోఏల దీక్షల దగ్గర, ఏరియా హాస్పిటల్‌ కార్మికులు, పెయింటర్స్‌ యూనియన్‌, చిరు పండ్ల వర్తకులు, ఫుట్పాత్‌ కార్మికులు, సీఐటీయూ పతాకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు ఎన్‌.నాగరాజు, జి.లక్ష్మణ్‌, అప్పారి రాము, అజరు కుమార్‌, సిహెచ్‌ రమేష్‌, వి.రాము, కాపుల రవికుమార్‌, జాకీ, సాయి, శ్రీను, రమాదేవి, వాసు, బాలాజీ, గోపాలకృష్ణ, చంద్ర లీల, వెంకటలక్ష్మ, బి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ములకలపల్లి హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని సీఐటీయూ మండల కన్వీనర్‌ నిమ్మల మధు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశంలోని బీజేపీ ప్రభుత్వం తన రాజకీయ స్వభావం కోసం కులాల, మతాల మధ్య చిచ్చు పెడుతుందని అన్నారు. కార్మిక వర్గ ఐక్యతతో మతోన్మాద శక్తులను ఓడించాలని అన్నారు. కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసే కుట్ర మానుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హమాలీ వర్కర్స్‌ యూని యన్‌ మండల అధ్యక్షులు నకిరికంటి పుల్లారావు,గడ్డం వెంకటే శ్వర్లు, రామారావు, వెంకన్న, సాగర్‌ తదితరులు పాల్గొన్నారు.
బూర్గంపాడు అన్నీ ఉత్పత్తి, పంపిణీ వినిమయ మార్గాలను సామాజికీకరించడం ద్వారా మత్రమే వర్గ దోపిడిని అంతం చేసి సోషలిస్టు రాజ్యాన్ని స్థాపించడం సాధ్యమౌతుందని ఇందుకు కార్మిక కర్షక, రైతు, కూలి ఐక్యత, వర్గ పోరాటాలు నిర్మించాలనే ఆశయాలతో 1970లో సీఐటీయూ ఏర్పడిందని సీఐటీయూ మండల కన్వీనర్‌ బర్ల తిరుపతయ్య అన్నారు. మండల కేంద్రంలో సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవాన్ని వ్యకాస మండల ఉపాధ్యక్షులు బయ్యా రాము అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా సీఐటీయూ జండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో రాయల వెంకటేశ్వర్లు, పాండవుల రామనాధం, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందు పేదలు, కార్మిక వర్గ ప్రయోజనాల కోసమే 1970లో సీఐటీయూ ఆవిర్భావం జరిగిందని మండల కన్వీనర్‌ తాళ్లూరి కృష్ణ అన్నారు. సీఐటీయూ 54వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బిల్డింగ్‌ వర్కర్స్‌ అడ్డా పై మంగళవారం జండా విష్కరణ చేశారు. అనంతరం కామ నాగరాజు అధ్యక్షతన జరిగిన సభలో పాల్గొని మాట్లాడుతూ నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక పోరాటాల ద్వారా సాదించుకున్న చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్‌ కోడ్లు తెచ్చిందని కార్మికుల మధ్య మతాన్ని జొప్పించి కార్మికులను విడ దీసి లబ్ధి పొందాలని చూస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో బలరాం, ఎస్‌.వెంకన్న, శ్రీను, రవి, రామన్న, నరసింహారావు, సుగుణ తదితరులు పాల్గొన్నారు.
అశ్వారావుపేట : సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవాన్ని అశ్వారా వుపేట లోనూ ఆర్భాటంగా మంగళవారం నిర్వహించారు. 53 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హమాలీ అడ్డాలో సంఘ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్‌ మాట్లాడుతూ మతోన్మాద చర్యల వల్ల కార్మిక వర్గం తీవ్ర ఇబ్బందులకు గురైందని, కులం పేరుతో, మతం పేరుతో ప్రాంతం పేరుతో విభజించు పాలించు అనే రకంగా బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్‌, రాంబాబు, హనుమంతరావు, అబ్రహం తదితరులు పాల్గొన్నారు.

Spread the love