ఉత్సాహంగా సాగిన సైక్లోథాన్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌ : అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా నిర్వహించిన సైక్లోథాన్‌ ఉత్సాహంగా సాగింది. మహిళల ఫిట్‌నెస్‌, ఆరోగ్యం, శ్రేయస్సులపై అవగాహన కల్పించటంలో భాగంగా భారత్‌లో ఆపిల్‌ ఉపకరణాల సంస్థ ఆప్ట్రోటిక్స్‌ 10 కిమి సైక్లోథాన్‌ను నిర్వహించింది. ఆదివారం ఉదయం గచ్చిబౌలిలో జరిగిన సైక్లోథాన్‌లో సుమారు 800 మంది వరకు క్రీడాస్ఫూర్తి వాతావరణంలో పోటీపడ్డారు. తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్‌) చైర్మెన్‌ డాక్టర్‌ ఆంజనేయగౌడ్‌, మాదాపూర్‌ డిఎస్పీ శిల్పవల్లి జెండా ఊపి సైక్లోథాన్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఆప్ట్రోనిక్స్‌ సీఈవో మేఘన సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love