ఫ్రీజింగ్‌తో లాభదాయకం

– వేతన ఒప్పందం బాగాలేదని తప్పుడు ప్రచారం చేసేవారికి సవాల్‌
– సీఐటీయూ జేబిసిసిఐ సభ్యులు మంద
– విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడి
నవతెలంగాణ-కొత్తగూడెం
కోల్‌ కత్తాలో ఈనెల 19, 20 తేదీల్లో జరిగిన 11వ వేతన ఒప్పందం కార్మికులకు లాభదాయకం అని సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జేబిసిసిఐ సభ్యులు మంద నరసింహారావు పేర్కొన్నారు. బుధవారం కొత్తగూడెం సిఐటియూ కార్యాలంయలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో నరసింహారావు మాట్లాడుతూ అండర్‌ గ్రౌండ్‌ అలవెన్స్‌ 9 శాతం నుంచి 11.25 శాతం, స్పెషల్‌ అలవెన్స్‌ 4 శాతం నుంచి 5 శాతం, ఇంటి అద్దె 2 శాతం నుంచి 2.5 శాతం పెంచి ఫ్రీజింగ్‌ చేయడం వల్ల కార్మికులకు లాభదాయకం జరిగిందన్నారు. బేసిక్‌ 49 శాతం పెరగడంతో ఈ మూడు అలవెన్స్‌లు బేసిక్‌తో లింక్‌ అప్‌ అయై ఉండడం వల్ల 85 శాతం పెరిగాయని వివరించారు. ఈ ఒప్పందంలో 5 జాతీయ కార్మిక సంఘాలలో సిఐటియు, ఏఐటీయూసీ, బిఎంఎస్‌ అంగీకరించిన ఎచ్‌ఎంఎస్‌, ఐఎన్‌టియుసి అంగీకరించ కూడా మీనా మీసాలు లెక్కించాయన్నారు. కానీ సిఐటియు లెక్కలు వేసి ఫ్రీజింగ్‌తో లాభమే కలిగిందని వివరించడంతో అన్ని కార్మిక సంఘాలు అంగీకరించి సంతకాలు చేశాయని గుర్తుచేశారు. అండర్‌ గ్రౌండ్‌ అలవెన్స్‌, స్పెషల్‌ అలవెన్స్‌ 2021 జూలై నుంచి కార్మికులకు లెక్క కట్టిస్తారని పేర్కొన్నారు. అన్ని అలవెన్సులు కూడా 25 శాతం పెంచుకోవడం జరిగిందన్నారు. అగ్రిమెంట్‌పై సంతకాలు చేసి కొన్ని సంఘాల ఒత్తిడితో అంగీకరించామని ఫ్రీజింగ్‌ వల్ల కార్మికులకు నష్టం కలుగుతుందని ప్రచారం చేయడం సిగ్గు చేటు అని, ఏ విధంగా నష్టం కలుగుతుందని కార్మికుల మధ్యలో బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. ఈ విలేకర్ల సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయగిరి శ్రీనివాస్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎలగొండ రఘు, వై.వెంకటేశ్వరరావు, గాజుల రాజారావు, గడల నరసింహారావు పాల్గొన్నారు.

Spread the love