సీఎ కేసీఆర్‌ హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయం

తెలంగాణలో సంపదను పెంచుతూ, పేదలకు పంచుతున్న వైనం
దశాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయండి
ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి
నవతెలంగాణ-కొడంగల్‌
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమని వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయ మని ఆశాభావం వ్యక్తం చేశాడు. తెలంగాణ రాష్ట్రం భారత దేశానికి మాడల్‌గా నిలిచిందన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు కేవలం తెలంగాణలో అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతోందన్నారు. కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, రైతులకు 24 గంటల కరెంట్‌, షాదీ ముబారక్‌, దళిత బంధు, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయలాంటి బృహత్తర పథకాలను ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళుతున్న సీఎం కేేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. బీఆర్‌ఎస్‌ దశాబ్ది ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జూన్‌ 2 నుంచి ప్రారంభమై 21 రోజులు కొనసాగనున్న ఈ ఉత్సవాలను నియోజక వర్గంలోని ప్రతీ గ్రామంలో బీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు దామోదర్‌ రెడ్డి, కౌన్సిలర్‌ మధుసూదన్‌ యాదవ్‌, బీఆర్‌ఎస్‌ మాజీ మండల అధ్యక్షులు గోడల రాంరెడ్డి , మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ బీములు,సర్పంచులు వెంకట్‌ రెడ్డి, పకీరప్ప, అంజాద్‌, మాజీ సర్పంచ్‌ రమేష్‌ బాబు, నవాజ్‌ తదితరులు పాల్గొన్నారు .

 

Spread the love