క్యాబేజీ.. ఎంతో మేలు

క్యాబేజీ.. ఎంతో మేలుక్యాబేజీని తినడానికి చాలా మంది ఇష్టపడరు. దీనికి కారణం. వండేటప్పుడు వచ్చే వాసన. నీటి శాతం ఎక్కువగా ఉన్న క్యాబేజీని ఈ మధ్య ఎక్కువమంది డైట్‌లో వాడుతున్నారు. కానీ క్యాబేజీ మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. పోషకాలు ఎక్కువగా ఉండే దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల పలు ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.
– క్యాబేజీలో పాలీఫెనాల్స్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్స్‌ సమృద్ధిగా ఉన్నాయి.
– క్యాబేజీ నీటిలో ఇండోల్‌-3 కార్బోనైట్‌ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్‌ ఉండటం వలన కాలేయం ఆరోగ్యం మెరుగవుతుంది.
బరువు తగ్గటానికి, కంటి సమస్యలను తగ్గించడంలో క్యాబేజీ బాగా ఉపయోగపడుతుంది.
రోగ నిరోధక శక్తి మెరుగు పడుతుంది.
ఇన్ఫెక్షన్స్‌ రాకుండా శరీరాన్ని కాపాడుతుంది.
చర్మం మృదువుగా కాంతివంతంగా మెరుస్తుంది..
చర్మం పొడిబారకుండా ఉంటుంది.
ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఎముకలకు అవసరమైన బలాన్ని అందిస్తాయి.
రక్తహీనత సమస్య తగ్గడమే కాకుండా రక్త సరఫరా బాగుంటుంది.
శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి బరువు తగ్గటానికి సహాయపడుతుంది.
క్యాబేజీ ఉడకబెట్టిన నీటిని తాగితే జీర్ణాశయంలో, పేగుల్లో పుండ్లు ఏర్పడకుండా నివారిస్తుంది.
గ్యాస్‌, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి..న

Spread the love