అశ్వారావుపేటలో సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం..

నవతెలంగాణ – అశ్వారావుపేట : సిఐటియు ఆవిర్భావ దినోత్సవాన్ని అశ్వారావుపేట లోనూ ఆర్భాటంగా మంగళవారం నిర్వహించారు. 53 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హమాలీ అడ్డా లో సంఘ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ మాట్లాడుతూ మతోన్మాద చర్యల వల్ల కార్మిక వర్గం తీవ్ర ఇబ్బందులకు గురైందని,కులం పేరుతో,మతం పేరుతో ప్రాంతం పేరుతో విభజించు పాలించు అనే రకంగా బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. కార్మికులకు రోజుకు కనీస వేతనం రూ. 178 లు నిర్ణయించిందని,ఎనిమిది గంటల పనిని 12 గంటలకు పెంచిందని ,కార్మిక చట్టాలను మార్చి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా లేబర్ కోడ్స్ ను తెచ్చిందని తెలిపారు.ఈ రకంగా కార్మిక వర్గంపై దాడికి పాల్పడిందని అన్నారు. నిత్యావసర సరుకుల ధరలు ఎన్నో రేట్లు పెరిగాయని , కార్మికులకు వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు చేస్తుందని, ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటిని ప్రైవేటు పరం చేస్తుందని,స్కీం వర్కర్లపై దాడి చేస్తుందని ఆశ,అంగన్వాడి,వివోఏలు గ్రామపంచాయతీ మధ్యాహ్న భోజన కార్మికులు హమాలీ లు భవన నిర్మాణ కార్మికులు తదితర సంఘటిత అసంఘటిత రంగాలపై బిజెపి ప్రభుత్వం విచ్చలవిడి దాడులకు పాల్పడుతుందని ఆరోపించారు.దీనికి వ్యతిరేకంగా సమైక్యంగా కార్మిక వర్గం మొత్తం పోరాటాలకు సిద్ధం కావాలని  పిలుపునిచ్చారు.ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల వల్ల కార్మికులు రోజురోజుకు నిరుపేదలు గా మారుతున్నారని స్కీం వర్కర్లను,ప్రైవేటీకరణ చేయడానికి ఇప్పటికే ప్రభుత్వం పూనుకుందని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్,రాంబాబు, హనుమంతరావు, అబ్రహం తదితరులు పాల్గొన్నారు.
Spread the love