జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

రాష్ట్ర పర్యాటక అభివద్ధి సంస్థ
మాజీ చైర్మెన్‌ ఉప్పల శ్రీనివాస గుప్త
నవతెలంగాణ -నాగోల్‌
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కషి చేస్తానని తెలంగాణ పర్యాటక శాఖ అభివద్ధి సంస్థ మాజీ చైర్మెన్‌ ఉప్పల శ్రీనివాస గుప్తా అన్నారు. హైదరాబాద్‌ నాగోల్‌లో డెమోక్రటిక్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ (డీజేఎఫ్‌) ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల శిక్షణ సంస్థ ‘శ్కెలి’ తరగతుల ప్రారంభ కార్యక్రమానికి ఉప్పల శ్రీనివాస గుప్తా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జర్నలిస్టులు తమ వత్తిలో రాణించడానికి డీజేఎఫ్‌ ఆధ్వర్యంలో ఉచి తంగా శిక్షణ ఇవ్వడం గొప్ప విషయమన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో మీడియా నిర్వర్తించిన పాత్ర ఎన లేనిదని, తెలంగాణ ఏర్పాటు అనంతరం బీఆర్‌ఎస్‌ ప్రభు త్వం జర్నలిస్టులకు అన్నివేళలా అండగా నిలుస్తోంద న్నారు. బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు సర్దార్‌ పుటం పురుషోత్తం మాట్లాడుతూ డీజేఎఫ్‌ చేస్తున్న కృషికి అన్ని రకాలుగా మద్దతుగా ఉంటానన్నారు. కోదాడ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆవుల రామారావు మాట్లాడుతూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా డీజేఎఫ్‌ ఆధ్వర్యంలో పాత్రికేయులకు శిక్షణ ఇవ్వడం గొప్ప విషయమని కొనియాడారు. డీజేెఎఫ్‌ జాతీయ గౌరవాధ్యక్షుడు పోలిశెట్టి విశ్వనాథ్‌ మాట్లాడుతూ పాత్రికేయులు తమ విధినిర్వహణలో ఎనలేని కీర్తప్రతిష్టలను సంపాదించడానికి ఈ శిక్షణ తరగతులు దోహదపడతాయన్నారు. డీజేఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు మానసాని కష్ణా రెడ్డి మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో తమ ఉనికిని చాటేలా శ్కెలిలో శిక్షణ పొందే విద్యార్థులకు ఆచరణాత్మాక తరగతులను నిర్వహిస్తామన్నారు. తెలంగాణ డీజేెఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాసం రత్నాకర్‌ పటేల్‌, కొంతం యాదిరెడ్డి, డీజేెఎఫ్‌ తెలంగాణ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శ్రీనివాస రావు జాదవ్‌లు మాట్లాడుతూ పాత్రికేయుల హక్కుల సాధనకు పాటుపడతామన్నారు. ఈ కార్యక్రమంలో డీజేెఎఫ్‌ జాతీయ పీఆర్‌వో సిద్దు బట్రాజ్‌, డీజేఎఫ్‌ రాష్ట్ర నేతలు కంకణాల శ్రీనివాస్‌, శంకర్‌ నాయక్‌, దారా మధు, గీత, బండ్రు శ్రీనివాస్‌, విద్యార్థులు, వివిధ జిల్లాల పాత్రికేయులు పాల్గొన్నారు.

Spread the love