చీతాల మృతిపై వివరణివ్వండి : సుప్రీం

న్యూఢిల్లీ: ‘ప్రాజెక్ట్‌ చీతా’లో భాగంగా విదేశాల నుంచి తీసుకొచ్చిన చీతాలు ఒక్కొక్కటిగా మరణిస్తుండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి 20 చీతాలను తీసుకొచ్చారు. వాటిని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌లో విడిచిపెట్టారు. ఇందులో ఇప్పటి వరకు 8 చీతాలు మరణించాయి. మరో రెండు చీతాల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. విదేశాల నుంచి తీసుకొచ్చిన వాటిలో 40శాతం చీతాలు మత్యువాత పడ్డాయని, ఇది మంచి సంకేతం కాదని పేర్కొంది.

Spread the love