‘బాలాసోర్‌’ ప్రమాదంలో రైల్వే మంత్రి నైతికత ఏది?

170 సంవత్సరాల ఘన చరిత్ర మన రైల్వే వ్యవస్థది. ప్రపంచంలో నాల్గో అతిపెద్ద రైల్వే వ్యవస్థ భారత్‌దే. అతిపేదలకు-సామాన్యులకు చౌకైన, మెరుగైన రవాణా సౌకర్యం ఇచ్చేది మన రైల్వే రంగం. ప్రతి రోజూ మధ్యతరగతి ప్రజలు, వ్యాపారస్తులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు రైళ్లను ఉప యోగించు కుంటూ ఈ రంగాన్ని కూడా బలోపేతం చేస్తున్నారు. అలాంటి రైల్వేరంగాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన పాల కులు ఆ దిశగా ఆలోచించడం లేదు. భారత్‌ రైల్వే వార్షిక ఆదాయం 2.40 లక్షల కోట్లు. కానీ ప్రజల భద్రతకు కేంద్రం రూ.5వేల కోట్లు కూడా ఖర్చు చేయదు. వందే భారత్‌, గరీబ్‌రథ్‌, బుల్లెట్‌, స్పీడ్‌ ట్రైన్స్‌ ప్రవేశపేట్టే కాలంలో రైలు ప్రమాదాలూ దేశాన్ని విషాదంలో ముంచెత్తుతున్నాయి. నెహ్రూ కాలం నుండి నరేంద్రుడి కాలం దాకా జరుగుతూనే ఉన్నాయి.
ఒడిసాలో బాలాసోర్‌లో 300 మంది మృతి, 1200మంది క్షత గాత్రులు- ఒకేసారి మూడు రైళ్ళు ప్రమాదం (గూడ్స్‌ – కోర మండల్‌ – యశ్వంతపూర్‌) ఈ సంవత్సరం మిగిల్చిన విషాదం. నేటి రైల్వేమంత్రి అశ్వన్‌ వైష్ణవ్‌ రాజీనామా చేయాలనే డిమాండ్స్‌ పత్రికల్లో చూస్తున్నాం.1956 ఆగస్ట్‌లో (నాటి ఆంధ్రప్రదేశ్‌) మహబూబ్‌నగర్‌ వద్ద రైలు ప్రమా దంలో 112 మంది మృతిచెందితే… క్షణకాలం ఆలోచించ కుండా నైతిక బాధ్యత వహిస్తూ నాటి రైల్వే మంత్రి లాల్‌బహుదూర్‌శాస్త్రి రాజీనామా చేస్తే నాటి ప్రధాని నెహ్రూ ఆమోదించలేదు. పై విషాదం జరిగిన మూడు నెలల లోపే మరోసారి తమిళనాడులో జరిగిన మరో రైలు ప్రమాదంలో 144మంది మరణించారు. లాల్‌బహు దూర్‌ విలవిలలాడిపోయి రాజీనామా అమోదించే దాకా నెహ్రూపై ఒత్తిడి తెచ్చి ఆమోదింప జేసుకున్నారు. అదీ నైతికత.. ఆదర్శం! 1981 జూన్‌ 6వ తేదీ బీహార్‌లో భాగమతి నదివద్ద సహార్సాకు వెళ్ళే రైలు 7 బోగీలు నదిలో పడ్డాయి. 750మంది కొట్టుకుపోగా 235 మృతదేహాలే లభ్యమయ్యాయి. బాధ్యులెవరు? అదే సంవత్సరం 8జూలై 1981 కేరళలో పెరు మాన్‌ వద్ద రైలు ప్రమాదంలో 150 మంది మృతి చెందారు. లోకల్‌ ప్యాసింజర్‌ రైలును, ఐలాండ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢకొీనడంతో ఈ ప్రమాదం జరిగింది.1995 ఆగస్టు 20న ఆగ్రా వద్ద పురు షోత్తమ్‌ ఎక్స్‌ప్రెస్‌ – కాళింది ఎక్స్‌ ప్రెస్‌లు ఢకొీన్నాయి. 358 మంది మృతి. 1999 ఆగస్టు 2న అస్సాంలో అదవ్‌ – అస్సాం ఎక్స్‌ప్రెస్‌ – బ్రహ్మపుత్ర మెయిల్‌ను ఢకొీంది. 290 మంది మృతి. నాటి ఎన్‌డీఏ వాజ్‌పేయి ప్రభుత్వంలో నితీష్‌ కుమార్‌ రైల్వేమంత్రి రాజీనామా చేశాడు.పై ఘటనకు ముందే 1998 నవంబర్‌ 26పంజాబ్‌లో కాళింది ఎక్స్‌ప్రెస్‌- జమ్ముతావీ ఢకొీట్టింది. దాదాపు 212 మంది మృతి, చాలా మంది గాయ పడ్డారు. 2000 సంవత్సరంలో రెండు రైలు ప్రమాదాలు జరగ్గా మమతాబెనర్జీ రైల్వేమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆనాటి ప్రధాని వాజ్‌పేయి అది ఆమోదించ లేదు. (నేడు కోరినా ఇవ్వడం లేదు). 2009 ఫిబ్రవరి 13 ఒడిస్సా – జైపూర్‌లో రైలు ప్రమాదంలో 16మంది మృతి చెందారు. 2010 మే 28 మిడ్నా పూర్‌లో జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంలో 170మంది మృతిచెందారు. తేదీలు, సంవ త్సరాలుగా రాస్తే పెద్ద జాబితా వస్తుంది. కానీ ఈ దేశం దిగ్భ్రాంతి చెందిన ప్రమాదాల్లో ప్రము ఖంగా ఉత్తర బంగా – వనాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంలో 63 మంది మృతిచెందారు. ఛాప్రా-మధుర ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదం లో 25మంది, తమిళనాడు-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంలో 30మంది, యూపీ-సంత్‌ కబీర్‌-గోరఖ్‌రాం ఎక్స్‌ప్రెస్‌ ప్రమా దంలో 25మంది, డెహ్రాడూన్‌, వారణాసి జనతా ఎక్స్‌ప్రెస్‌ యాక్సిడెంట్‌లో 30మంది, బీకనీర్‌- గౌహతి ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంలో 9మంది, హౌరా-ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంలో 140మంది మృతి చెందారు. 2016 నవంబర్‌ 20వ తేదీన యూపీ కాన్పూర్‌ సమీపంలో పుఖరాయన్‌ వద్ద ఇండోర్‌-పాట్నా రైలు పట్టాలు తప్పగా 150మంది ప్రాణాలు కోల్పోయారు. నేటి మోడీ నాడు ప్రధానే. నాడు రైల్వే మంత్రి సురేష్‌ప్రభు. వెంటనే రాజీనామా చేశాడు. కొద్దికాలం ఆగమని మోడీ కోరినా సురేష్‌ ప్రభు వైదొలిగి బయటకెళ్ళాడు. కానీ ‘బాలాసోర్‌’ రైలు ప్రమాదంలో వందలాది మంది చనిపోయి, వేలాదిమంది క్షతగాత్రు లైనా సంబంధిత రైల్వే మంత్రి నైతికతను ప్రదర్శించి తన పదవికి రాజీనామా చేయలేదు. అంటే ‘ప్రజలు ఏమై పోయినా ఫర్వాలేదు. మేం మాత్రం మా పదవులు పట్టుకుని వేలాడు తాం’ అన్న ధోరణియే బీజేపీ పాలకవర్గంలో కనిపిస్తున్నది
తంగిరాల చక్రవర్తి
9393804472.

Spread the love