హాజిల్‌వుడ్‌ ఔట్‌

– మైకల్‌ నెసర్‌ ఇన్‌
లండన్‌ : ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ముందు ఆసీస్‌కు ఎదురుదెబ్బ. ఐపీఎల్‌లో గాయపడిన జోశ్‌ హాజిల్‌వుడ్‌ ఫైనల్‌ పోరు సమయానికి పూర్తి ఫిట్‌నెస్‌ సాధించే అవకాశం కనిపించటం లేదు. దీంతో హాజిల్‌వుడ్‌ స్థానంలో ఆస్ట్రేలియా మైకల్‌ నెసర్‌ను ఎంపిక చేసింది. తుది జట్టులో చోటు కోసం స్కాట్‌ బొలాండ్‌తో నెసర్‌ పోటీపడాల్సి ఉంటుంది. కౌంటీ క్రికెట్‌లో జోరుగా వికెట్ల వేట సాగించిన మైకల్‌ నెసర్‌.. విదేశీ గడ్డపై టెస్టు అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంగ్లాండ్‌తో యాషెస్‌ సిరీస్‌కు జోశ్‌ హాజిల్‌వుడ్‌ అందుబాటులో ఉంటాడని క్రికెట్‌ ఆస్ట్రేలియా తెలిపింది. జూన్‌ 16న బర్మింగ్‌హామ్‌ టెస్టుతో యాషెస్‌ సమరం ఆరంభం కానుంది.

Spread the love