వ్యక్తి మృతికి కారణమైన “కరీమ్ లాలా”కు ఏడేళ్ల జైలు

నవ తెలంగాణ-కంటేశ్వర్
షేక్ అక్బర్ మృతి చెందడా నికి కారకుడైన అబ్దుల్ కరీమ్ (కరీమ్ లాలా)కు ఏడు సంవత్సరాల కఠిన జైలుశిక్ష విధిస్తు నిజామాబాద్ సెషన్స్ జడ్జి సునీత కుంచాల మంగళవారం తీర్పు చెప్పారు.సెషన్స్ కోర్టు వెలువరించిన ఇరవై రెండు పేజీల తీర్పులోని వివరాలు. నిజామాబాద్ నగరంలోని బర్కత్ పుర చెందిన కరీమ్ లాలా,ఆటో నగర వాసిఐన షేక్ అక్బర్ స్నేహితులు. అక్బర్ తన వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా కరీమ్ దగ్గర పన్నెండు వేలు అప్పు తీసుకున్నాడు.6 ఫిబ్రవరి,2020 న ఇద్దరు మద్యం సేవించి ,మరికొంత మద్యాన్ని తీసుకుని అహ్మది బజార్ లోని మటన్ మార్కెట్ లో కలిసి తాగారు.డబ్బుల విషయం ప్రస్తావించిన కరీమ్ తో డబ్బులు ఏమి ఇచ్చేది లేదని అక్బర్ అనడంలో మద్యం మత్తులో ఉన్న కరీమ్ “మేరే పైసే దేదోరే నైతో మార్ దాలుంగా” అంటు స్థానికంగా ఉన్న కట్టెతో అక్బర్ తలపై బలంగా కొట్టి గాయపరిచారు.త్రీవ్ర గాయాల పాలైన అతను మృతి చెందాడు.కోర్టు నేర న్యాయవిచారణ లో ముద్దాయి పై నేరారోపణలు రుజువు కావడంతో కరీమ్ కు ఇండియన్ పినల్ కోడ్ సెక్షన్ 304 పార్ట్2 ప్రకారం ఏడేళ్ల కఠిన జైలుశిక్ష తో పాటు రెండు వేల రూపాయల జరిమాన విధించారు. జరిమానా చెల్లించని ఎడల అదనంగా మూడు నెలల సాధారణ జైలుశిక్ష అనుభవించాలని తీర్పు లో పేర్కొన్నారు. నిజామాబాద్ ఒకటవ టౌన్ పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవిరాజ్ ప్రాసిక్యూషన్ నిర్వహించారు

Spread the love