పలు కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్ భేటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తిని వ్యక్తం చేశాయి. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కె.తారకరామారావు ఆయా కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణం, ప్రభుత్వ ప్రగతిశీల విధానాలను వివరించారు. ఇప్పటికే రాష్ట్రం బాట పట్టిన అంతర్జాతీయ సంస్థలకు సంబంధించిన విశేషాలను తెలిపారు.
హైదరాబాద్‌లో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నట్టు మాండీ హౌల్డింగ్స్ సంస్థ సీఇఓ ప్రసాద్ గుండు మొగుల తెలిపారు. దీంతో 2 వేల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. స్టోరబుల్ సంస్థ హైదరాబాద్‌లో 100 మంది సాఫ్ట్‌వేర్ డెవలపర్లను నియమించుకోవడంతో పాటు పరిశోధనాభివృద్ధి కోసం మరికొంత మంది నిపుణులను తీసుకుంటామని ఆ కంపెనీ ప్రతినిధులు జోనాథన్ లూయీస్, నీల్ వర్మలు తెలిపారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)తో పాటు స్థానిక విద్యా సంస్థలతో కలిసి పనిచేస్తామని వారు ప్రకటించారు. సాఫ్ట్‌వేర్ సంస్థ రైట్ కంపెనీ హైదరాబాద్‌లో ప్రారంభించబోయే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించింది. దీని ఏర్పాటుతో 500 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ద్వితీయశ్రేణి నగరాలకు తమ సేవలను విస్తరిస్తామని వెల్లడించారు. తయారీ ప్లాంట్ ను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు రేవ్ గేర్స్ సంస్త ఆసక్తిని ప్రదర్శించింది. ప్రోడక్ట్ డెవలప్మెంట్, డిజైన్ థింకింగ్ కోసం హైదరాబాద్‌లో టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు డిజిటల్ సొల్యూషన్స్, సప్లై చైన్ రంగంలో పెట్టుబడులు పెడతాం
ప్రముఖ కంపెనీ టెక్ జెన్స్ ముందుకొచ్చింది. డెలవరీ సెంటర్‌తో 10 వేల మందికి ఉపాధి
టెక్నాలజీ దిగ్గజం వీఎక్స్‌ఐ గ్లోబల్ సొల్యూషన్స్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న డెలవరీ సెంటర్‌తో 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆ సంస్థ గ్లోబల్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ ఎరికా బోగర్ కింగ్ తెలిపారు. హ్యూస్టన్‌లో మంత్రి కేటీఆర్ సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతేడాది దేశవ్యాప్తంగా ఐటీ రంగంలో 4.50 లక్షల ఉద్యోగాలు ఏర్పడితే అందులో 1.5 లక్షల ఉద్యోగాలు హైదరాబాద్‌లోనే వచ్చాయని తెలిపారు.