మంత్రి పదవికి రాజీనామా చేయలేదు

– హైదరాబాద్‌లో 9న దక్షిణ భారత రాష్ట్రాల బీజేపీ నేతల సమావేశం : జి.కిషన్‌ రెడ్డి
న్యూఢిల్లీ: అనారోగ్య కారణంవల్ల కేంద్ర మంత్రి వర్గ సమావేశానికి దూరంగా ఉన్నాననీ, కేంద్రమంత్రి పదవికి తాను రాజీనామా చేయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి చెప్పారు. అధిష్టానం ఏ ఆదేశాలిచ్చినా పాటిస్తానని, తనకు అధ్యక్ష పదవి ఇస్తారని అనుకోలేదని అన్నారు. ఈ మేర కు బుధవారం నాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. నిన్న (మంగళ వారం) తాను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు జెపి నడ్డా ఫోన్‌ చేసి విషయం చెప్పారన్నారు. గతంలో ఉమ్మడి ఏపీకి 2 సార్లు, తెలంగాణ తొలి బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశానన్నారు. నాలుగోసారి పార్టీ అధ్యక్షుడిగా తనపై అధిష్టానం బాధ్యతలు అప్పగించిందని అన్నారు. ఎంపీగా గెలిచాక హోం శాఖ సహాయ మంత్రిగా, ఆ తరువాత రెండేండ్లు క్యాబినెట్‌ మంత్రిగా పని చేశానని కిషన్‌ రెడ్డి గుర్తుచేసుకున్నారు. తాను ఏనాడూ పార్టీని ఏదీ కోర లేదని, పార్టీ ఆదేశాలు పాటిస్తూ వస్తున్నానన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో కృషి చేస్తా ననీ, సమిష్టి ప్రణాళిక తయారుచేసుకుని ముందుకు వెళ్తానని చెప్పారు. ప్రధాని మోడీ వరంగల్‌ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. వరం గల్‌ను రైల్వే తయారీ హబ్‌గా తయారు చేయబోతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఇంత పెద్ద వర్క్‌ షాప్‌, తయారీ యూనిట్‌ రావడం ఇదే మొదటి సారని అన్నారు. అలాగే మోడీ నూతన జాతీయ రహదారులకు భూమి పూజ చేస్తారని, వరంగల్‌ ఎయిర్‌ స్ట్రిప్‌ ద్వారా నేరుగా హెలి కాప్టర్‌లో అక్క డికి వచ్చి, భద్రకాళి దర్శనం చేసుకుంటారన్నారు. రైల్వే యూ నిట్‌ను వర్చు వల్‌గా ప్రారంభిస్తారన్నారు. 9న దక్షిణ భారత రాష్ట్రాల బీజేపీ ముఖ్య నేతల సమావేశం హైదరాబాద్‌లో జరుగుతుందని కిషన్‌ రెడ్డి తెలిపారు.

Spread the love