కారు ఢీకొని ఒకరు మృతి

నవతెలంగాణ – నాగర్ కర్నూల్ : ఎదురుగా వస్తున్న కారును ఢీకొని బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎక్స్ రోడ్ సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. మృతుని తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ మండలం చందుపట్ల గ్రామానికి చెందిన శివ (23) చందుపట్ల నుంచి నాగర్ కర్నూల్ వైపు వెళ్తున్నాడు. ఎదురుగా వచ్చిన కారు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు గమనించి జిల్లా ఆస్పత్రికి తరలించారు. కారు అక్కడే వదిలేసి కారు డ్రైవర్ పరారయ్యాడు. మృతుడు అవివాహితుడు.

Spread the love