బీఆర్ఎస్ కు జై కొడుతున్న ప్రజానీకం

నవతెలంగాణ – తొగుట
తెలంగాణ రాష్ట్రానికి కేసీఆరే శ్రీ రామ రక్ష అని, కేసీఆర్ లేని పాలన, లోటు స్పష్టంగా కనిపిస్తుందనిమండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాం రెడ్డి, సొసైటీ చైర్మన్ కె హరికృష్ణా రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దోమల కొమురయ్య లు ఆరోపించారు. ఆదివారం మెదక్ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వ హించారు. స్థానిక హనుమాన్ దేవాలయంలో వెంకట్రామరెడ్డి ఘన విజయం సాధించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్ని కల్లో 6 గ్యారంటీలు, 420 హామీల పేర అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు. ఉన్న కరెంటు ఇవ్వకపోవడంతో, తాగు, సాగునీటి కష్టాలు మొదలయ్యాయని తెలిపారు. ఉప ఎన్నికల్లో మాయ మాటలు చెప్పిన రఘునందన్ రావుకు అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించారని, ఆయన మాటలు నమ్మ వద్దన్నారు. మాజీ కలెక్టర్ గా పనిచేసిన వెంక ట్రామారెడ్డి ప్రజా సేవ కోసం వొస్తున్నారని, ఆయ నకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు.
గెలిచిన 30 రోజుల్లో 100 కోట్ల తో ట్రస్టు ఏర్పాటు చేసి యువతీ, యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశా లు కల్పిస్తారని, ఈ విషయం యువత గ్రహించాల న్నారు. తెలంగాణ కు కాంగ్రెస్, బీజేపీలు డోఖా చేసాయని పేర్కొన్నారు. బీజేపీ హయాంలో పేదల కు ఒరిగిందేమి లేదని, డీజిల్, పెట్రోల్, గ్యాస్, నిత్యావసర ధరలు పెరిగాయన్నారు. నల్ల ధనం తెచ్చి పేదల ఖాతాలో వేస్తామని ప్రధానమంత్రి  మోసం చేశారన్నారు. ఎవరిని అడిగినా కాంగ్రెస్ హయాంలో నీళ్లు, కరెంట్ రావడం లేదని ప్రజలు  అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎంపీ ఎన్ని కల్లో బీఆర్ఎస్ పార్టీకి ఘన విజయం అందించా లని కోరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తోయే టి ఎల్లం, కో ఆప్షన్ సభ్యులు ఎండీ కలీమోద్దీన్, మండల పార్టీ మాజీ అధ్యక్షులు చిలువేరి మల్లా రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది రాంరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు నంట పరమేశ్వర్ రెడ్డి, బోయిని శ్రీనివాస్, తగరం అశోక్, సూరంపల్లి స్వామి, బూత్ కమిటీ అధ్యక్షుడు  గడ్డం రాఘవు లు, నాయకులు దుబ్బాక కనకయ్య, ఐలయ్య, రమేష్, పరమేష్ గ్రామ యూత్ అధ్యక్షులు మండ ల కుమార్, నంట. సతీష్ రెడ్డి, మండల. లింగం,తదితరులు పాల్గొన్నారు.
Spread the love