‘రాకెట్‌ మహిళ’ జాబిల్లి అన్వేషణ

రీతూ కరిధాల్‌… ఏరోస్పేస్‌ ఇంజనీర్‌, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)లో సీనియర్‌ సైంటిస్ట్‌. ఆమెను భారతదేశపు ‘రాకెట్‌ మహిళ’ అని కూడా పిలుస్తారు. రెడ్‌ ప్లానెట్‌కు మొదటి మిషన్‌ అయిన మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌ (వీఉవీ)లో, మంగళయాన్‌లో కూడా ఆమె ముఖ్య పాత్ర పోషించారు. ప్రస్తుతం జాబిల్లిని చేరేందుకు ఆకాశంలోకి దూసుకెళ్ళిన చంద్రయాన్‌-3 మిషిన్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె పరిచయం నేటి మానవిలో…
యువ శాస్త్రవేత్త అవార్డు
వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ ప్రకారం రీతూ 20కి పైగా పరిశోధనా పత్రాలను ప్రచురించారు. 2007లో డాక్టర్‌ అబ్దుల్‌ కలాం చేతుల మీదుగా యువ శాస్త్రవేత్త అవార్డును అందుకున్నారు. అలాగే సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఏరోస్పేస్‌ టెక్నాలజీస్‌ డ ఇండిస్టీస్‌ (SIATI) ఆమెకు 2017లో విమెన్‌ అచీవర్స్‌ ఇన్‌ ఏరోస్పేస్‌ అవార్డు అందుకున్నారు. ఇంకా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఆమెను బిర్లా సన్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుతో సత్కరించింది. మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌ విజయాన్ని వివరించే ఈవెంట్లలో కూడా ప్రదర్శించారు.
రీతూ ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నగరంలోని రాజాజీపురంలో 1975 ఏప్రిల్‌ 13న పుట్టారు. ఆమెకు ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరీమ ణులు ఉన్నారు. చదువుకు ప్రాధాన్యతనిచ్చే మధ్యతరగతి కుటుంబం వారిది. తండ్రి రక్షణ రంగంలో పని చేశారు. కోచింగ్‌ సంస్థలు, ట్యూషన్లు అందుబాటులో లేకపోయినా ఆమె తన స్వశక్తిని నమ్ముకొని గొప్ప శాస్త్రవేత్త అయ్యారు. చిన్నతనం నుంచి ఆమెకు అంతరిక్షం గురించి తెలుసుకోవాలని కోరిక. రాత్రి ఆకాశం వైపు చూస్తూ అంత రిక్షం గురించే ఆలోచించేవారు. చంద్రుడు, దాని ఆకారం, పరిమా ణాన్ని ఎలా మారుస్తుందో చూసి ఆశ్చర్యపోయేవారు. నక్షత్రాలను అధ్య యనం చేసి, ఆ చీకటి వెనుక ఏముందో తెలుసుకోవాలను కున్నారు. పాఠశాల రోజుల్లోనే ఇస్రో, నాసా నిర్వహించిన అంతరిక్ష కార్యకలా పాలకు సంబంధించిన వార్తా కథనాలను సేకరించి దాచుకునేవారు.
ఇస్రోలో ఉద్యోగం
రీతూ తన ప్రాథమిక విద్యను లక్నోలోని సెయింట్‌ ఆగెస్‌ స్కూల్లో పూర్తి చేశారు. ఆ తర్వాత నవయుగ కన్యా విద్యాలయంలో చదువు కున్నారు. లక్నో విశ్వవిద్యాలయం నుంచి ఫిజిక్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌ (గేట్‌) పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది, ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ డిగ్రీని అభ్యసించడానికి బెంగుళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్సి)లో చేరారు. ఎంటెక్‌ తర్వాత పీహెచ్‌డీ ప్రారంభించారు. ఆ సమయంలో ఓ కళాశాలలో పార్ట్‌టైం ప్రొఫెసర్‌గా పని చేశారు. 1997లో ఇస్రోలో దరఖాస్తు చేసుకొని ఉద్యోగం సంపాదించారు. అయితే అప్పటికి ఆమె ఉద్యోగానికి అంత సిద్ధంగా లేరు. ఎందుకంటే పీహెచ్‌డీ మధ్యలోనే వదిలేయాల్సి వస్తుందని బాధపడ్డారు. అయితే తన పీహెచ్‌డీ గైడ్‌ ప్రొఫెసర్‌ మనీషా గుప్తా, రీతూని వెంటనే ఇస్రోలో చేరిపొమ్మని సలహా ఇచ్చారు. దాంతో అప్పటి నుండి ఆమె ఇస్రోతో కలిసి పని చేయడం ప్రారంభించారు.
కీలక పాత్ర పోషించారు
యూఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌లో రీతూ తన మొదటి పోస్టింగ్‌ పొందారు. అక్కడ ఆమె పని అందరినీ ఆకర్షించింది. దాంతో మార్స్‌ మిషన్‌లో భాగస్వామి అయ్యారు. అలాగే మంగళయాన్‌ అభివృద్ధిలో ఆమె కీలక పాత్ర పోషించారు. మంగళయాన్‌ ఇస్రో సాధించిన గొప్ప విజయాలలో ఒకటి. ఇది అంగారక గ్రహానికి చేరుకున్న ప్రపంచంలో నాల్గవ దేశంగా భారత్‌గా నిలిచింది. ఇది 10 నెలల వ్యవధిలో జరిగింది. దీనికి అయిన ఖర్చు 450 కోట్లు మాత్రమే. ఆమె పని క్రాఫ్ట్‌ స్వయంప్రతిపత్తి వ్యవస్థను సంభావితం చేయడం, అమలు చేయడం. అలాగే చంద్రయాన్‌ 2 మిషన్‌లో కూడా పని చేశారు. ఇది చంద్రుడి ఉపరితలంపై రోవర్‌ను పంపించి 2019లో చంద్ర మట్టిని అధ్యయనం చేయడానికి ప్రయత్నించింది. బెంగుళూరుకు చెందిన టైటాన్‌ ఇండిస్టీస్‌లో పని చేస్తున్న అవినాష్‌ శ్రీవాస్తవను రీతూ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.
ఆపరేషన్స్‌ డైరెక్టర్‌గా…
ఇస్రో చేపట్టిన అనేక ప్రాజెక్ట్‌లకు రీతూ పనిచేశారు. వీటిలో కొన్నింటికి ఆపరేషన్స్‌ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. వీఉవీ కోసం ప్రాజెక్ట్‌ మేనేజర్‌, డిప్యూటీ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌గా, ఆర్బిటర్‌ భూమిని విడిచిపెట్టి, అంగారక గ్రహాన్ని పట్టుకో వడంలో క్లిష్టమైన కార్యకలాపాలు నిర్వ హించిన బృందానికి నాయకత్వం వహించారు. ప్రస్తుతం చంద్రయాన్‌-3 మిషన్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు. చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్ర యాన్‌-3 ల్యాండర్‌ను సున్నితంగా ల్యాండ్‌ చేయాలని భారత్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మిషన్‌ విజయవంతమైతే భూమి యొక్క సహజ ఉప గ్రహంపై అంతరిక్ష నౌకను సాఫ్ట్‌ ల్యాండింగ్‌ని విజయవంతంగా పూర్తి చేసిన నాల్గవ దేశంగా భారత్‌ అవతరిస్తుంది. అలాగే చంద్రుడి దక్షిణ ధ్రువంపై అంతరిక్ష నౌకను ల్యాండ్‌ చేసిన ప్రపంచంలోనే తొలి దేశంగా భారత్‌ అవతరిస్తుంది.

ఇస్రో ఉద్యోగమే లక్ష్యంగా
కల్పన… చిత్తూరు జిల్లాకు చెందినచంద్రయాన్‌-3కి అసోసియేట్‌డ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈమె చెన్నైలో బీటెక్‌ ఈసీఈ పూర్తి చేశారు. తండ్రి మద్రాసు హైకోర్టులో ఉద్యోగి. తల్లి గృహిణి. కల్పన చిన్నతనం నుంచే ఇస్రోలో ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో తన చదువు కొనసాగించారు. బీటెక్‌ పూర్తయిన వెంటనే ఇస్రోలో 2000లో శాస్త్రవేత్తగా విధుల్లో చేరారు. మొదట శ్రీహరికోటలో ఐదేండ్లపాటు విధులు నిర్వహించారు. 2005లో బదిలీపై బెంగళూరులోని ఉపగ్రహ కేంద్రానికెళ్లి అక్కడ పని చేశారు. ఐదు ఉపగ్రహాల రూపకల్పనలో భాగస్వాములయ్యారు. శ్రీహరికోట రాకెట్‌ కేంద్రం నుంచి 2018లో పంపిన చంద్రయాన్‌-2 ప్రాజెక్టులో కూడా కల్పన భాగస్వామ్యం ఉంది. ప్రస్తుతం చంద్రయాన్‌-3 ప్రాజెక్టు అసోసియేటెడ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

Spread the love