తెలుగులో రిలీజ్‌కి రెడీ

ఎమ్‌ మోహన శివకుమార్‌ సమర్పణలో సిఎమ్‌బి ప్రొడక్షన్స్‌ పతాకంపై కిచ్చా సుదీప్‌, అమలాపాల్‌ జంటగా ఎస్‌.కష్ణ దర్శకత్వలో సి.సుబ్రహ్మణ్యం నిర్మించిన కమర్షియల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘హెబ్బులి’. ఈ చిత్రం కన్నడలో విడుదలై విమర్శకుల నుండి మంచి సమీక్షలను అందుకోవడమే కాకుండా బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది.
ఈ సినిమాలో శంకర్‌, రవి కిషన్‌, సంపత్‌ రాజ్‌ నెగిటివ్‌ రోల్స్‌లో కనిపిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్‌ 4న గ్రాండ్‌గా తెలుగులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత సి.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ‘ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌లు, రొమాంటిక్‌ యాంగిల్‌తో కూడిన మంచి కమర్షియల్‌ ఓరియంటెడ్‌ కంటెంట్‌ ఉంది. కన్నడలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద 100 కోట్లు సాధించిన తొలి పక్కా కమర్షియల్‌ ఇది. అందుకే దీన్ని తెలుగులో ఆగస్ట్‌ 4న గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. ఈ సినిమా చూసిన వారందరికీ కచ్చితంగా నచ్చుతుంది’ అని తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : ఎ.కరుణాకర్‌, మ్యూజిక్‌ : అర్జున్‌ జన్య.

Spread the love