గిరిజన రైతుల భూమి గోస గోవుల మృత్యుఘోష

The land of tribal farmers is the death knell of Gosa cows– పెద్ద షాపూర్‌ తండాలో ద్యాన్‌ గోశాల దారుణం
– అగ్రిమెంట్‌ పేరుతో గిరిజనుల భూమి స్వాధీనం
– మూగజీవాలకు పోషణ లేక మృత్యువాత
– గోశాలలో పరిమితికి మించి గోవులు
 -తమ భూమి తమకు అప్పించాలని గిరిజనుల ఆందోళన, రాస్తారోకో బొంద పెట్టడంతో చుట్టుపక్కల నీరు కలుషితం
నవతెలంగాణ-శంషాబాద్‌
గోశాలకు అప్పగించిన ఎద్దులను కోర్టు ఆదేశాల మేరకు తిరిగి స్వాధీనం చేసుకునే క్రమంలో గోశాల నిర్వాహకులకు పోలీసులకు మధ్య వివాదం రాజుకుంది. గోశాలలో ఉంచిన 23 ఎద్దులను ఈ నెల ఒకటో తేదీన స్వాధీనం చేసుకొని, ఎద్దుల యజమాని కి అప్పగించాలని పోలీసులు గోశాల వద్దకు వెళ్తే అడ్డగించి పోలీసులపైనే దుర్భాషలాడి విధులకు ఆటంకం కలిగించా రు. అయినా పోలీసులు వెనుకడు గు వేయకుండా 23 ఎద్దులను పశువుల డాక్టర్ల సమ క్షంలో పరీక్షించి సంబంధిత వ్యక్తులకు అప్పగించి, అందుకు సంబంధించిన వివరాల ను కోర్టుకు సమర్పించారు. ఈ క్రమంలో ఎ ద్దులను తీసుకెళ్లకుండా అడ్డుకున్న గోశాల నిర్వా హకురాలు మీనాక్షి, సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన మండల పరిధిలో ని పెద్ద షాపూర్‌ తండా గ్రామ రెవెన్యూ జరిగింది. ఈ గోవులను స్వాధీనం చేసుకునే క్రమంలో అక్కడ గోశాలలో ఏర్పడుతున్న గోవుల మరణ మృదంగం వెలుగులోకి వచ్చింది.
గిరిజన రైతుల భూమి గోస,పశువుల మృత్యుఘోష
గోశాలను నిర్వహించుకుంటామని పెద్ద షాపూర్‌ తండా గ్రామ రెవెన్యూ పరిధిలో పి-వన్‌ రోడ్డు గొల్లూ రు చౌరస్తాలో గ్రామానికి చెందిన రైతుల వద్ద మూ డున్నర ఎకరాల భూమిని ద్యాన్‌ గోషాల నిర్వహించు కోవడానికి లీజుకు ఇచ్చారు. ఈ భూమిలో 100 లోపు గోవులను పెంచుతామని, ఎలాంటి అక్రమాల కు పాల్పడమని ఆ రైతులకు హామీ ఇచ్చారు. అయితే నమ్మిన ఆ గిరిజన లంబడా రైతులు భూమిని లీజుకి చ్చిన తర్వాత ధ్యాన్‌ గోశాల వారు విశ్వరూపం ప్రదర్శి స్తూ వచ్చారు. మూడున్నర ఎకరాల భూమిలో షెడ్లు, కాంక్రీట్‌ నిర్మాణాలు, సీసీరోడ్లు ఏర్పాటు, మృత్యువాత పడిన గోవులను పూడ్చి పెట్టడం, భూ యజమాను లను లోనికి రాకుండా అడ్డగింత మొదలుపెట్టారు. త న భూమిలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని చనిపోయిన పశువులను ఆ భూమిలోనే పూడ్చిపెట్టి భూమిని తమకు కాకుండా చేస్తున్నారని రైతుల ఆవేదన చెందారు. ఈ విషయం లో ఐదారు నెలల క్రితం లీజుకిచ్చిన రైతులు గోశాల వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేసి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయినా ఎలాంటి ఫలి తం లేకుండా పోయింది. గోశాల నిర్వాహకుల పలుకుబడి కారణంగా పోలీసులు కూడా చేసేదేమీ లేక వదిలేశారు.
పరిమితికి మించి గోవులు
గోశాల మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉంటే అందులో 13వందల పశువులు పెంచుతున్నట్లుగా నిర్వాహ కులు చెప్తున్నారు. అయితే వాస్తవానికి సం ఖ్య 2000 కంటే ఎక్కువ ఉంటుందనీ అక్కడ పని చేసే కూలీలు స్థానిక రైతులు చెప్తున్నారు. పశువులకు సరైన ఆహారం లేక బక్క చిక్కి ఆకలితో మలమల మాడుతూ ప్రాణాలు విడుస్తున్నాయి. ఇలా ప్రతిరో జూ నిర్వహణ లోపం కారణంగా 10-15 గోవులు మృత్యువాత పడుతుంటాయని అక్కడి రైతులు తెలిపారు. అయితే మరణించిన గోవులను అక్కడే ఖాళీ భూమిలో జేసీబీలతో గుంతలు తొవ్వి పూడ్చి పెట్టడం షరా మామూలుగా మారింది. వందలాది ప శువులను పాతిపెట్టడం వలన భూగర్భ జలాలు కలు షితమవుతున్నాయని చుట్టుపక్కల రైతులు ఆవేదన చెందుతున్నారు.
అక్రమ రవాణాలో..
పట్టుబడిన గోవులను శంషాబాద్‌ మండలంలో నిర్వహిస్తున్న గోశాలలకు పోలీసులు తరలించడం మామూ లుగా జరుగుతున్నది. ఈ క్రమంలో పరిమి తికి మించి గోషాలలో గోవులను ఉంచడం వలన అనారోగ్యం, మేత సరిపడ లేకపోవడం కారణంగా గోవులు మృత్యువాత పడుతున్నాయి.
మైనార్టీలే టార్గెట్‌గా..
సాధారణంగా ముస్లిం మైనారిటీలు గోవులను తరలిస్తుంటే కొంతమంది వాటిని అడ్డుకొని గోశాలల కు తర లిస్తున్నారు. వారు కోర్టు నుంచి ఆదేశాలు తీ సుకొని గోశాలకు వస్తే వాళ్లకు పశువులు అప్పజెప్ప కుండా ముస్లిం కసాయి వాళ్లు చంపేస్తారని తప్పు డు పద్ధతుల్లో అడ్డగిస్తూ ఇబ్బందులకు గురి చేస్తు న్నారు. తిండి పెట్టకుండా కనీస నిర్వహణ లేకుండా గోవులను నిర్లక్ష్యంగా చంపుతున్న వైనంపై మాత్రం వారు మాట్లాడటం లేదు
గోశాలను తరలించాలి
గోవుల హృదయ విదారక ఘటనలు చూసి పలు వురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు శంషాబాద్‌ మండలంలో నిర్వహిస్తున్న గోశాలలో గో వుల పరిస్థితి భయంకరంగా ఉందని గోవుల మృ త్యువాత చూసి చలించిపోతున్నారు. తమ భూము లు కోల్పోతున్న పెద్దషాపూర్‌ తండా గిరిజన రైతులు తమ భూమి తమకు అప్పగించాలని నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న గోశాలను ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్‌ చేస్తున్నారు.
ధర్నా చేసిన రైతులు
ఇందులో భాగంగానే గురువారం గొల్లూరు చౌరస్తా పి-వన్‌ రోడ్డు వద్ద గోశాల సమీపంలో పెద్ద షాపూర్‌ తండా వాసులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ప్లకార్డులతో నిరసన తెలిపారు. శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ శ్రీధర్‌కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకుని రాస్తారోకో విరమింపజేశారు. సెంటిమెంట్‌ కారణంగా గోవులను గాలికి వదిలేసి గోవుల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. రైతులు మాట్లాడుతూ ధ్యాన్‌ గోషాలను వెంటనే అక్కడి నుంచితరలించాలన్నారు. సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయం చేయాలని బాధిత గిరిజన రైతులు డిమాండ్‌ చేశారు.

Spread the love