తెలుగు చిత్ర సీమకి తీరని లోటు…

నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగు సినీ సంగీత ప్రపంచానికి రాజ్‌ చేసిన సేవలు అనిర్వచనీయం. సంగీత సంచలనాన్ని కోల్పోవడం తెలుగు చిత్ర సీమకే కాదు సంగీత ప్రపంచానికే తీరనిలోటు అంటూ రాజ్‌ ఆకాల మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ప్రముఖ సంగీత దర్శక ద్వయం ‘రాజ్‌-కోటి’ల్లో ‘రాజ్‌’ ఇక లేరు అని తెలియడం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎంతో ప్రతిభ గల రాజ్‌.. నా కెరీర్‌ ప్రారంభ దశలో నా చిత్రాలకు అందించిన బాణీలు.. ఆయా సినిమాల విజయంలో ప్రముఖ పాత్ర పోషించి.. ప్రేక్షకులను నన్ను మరింత దగ్గర చేర్చాయి. రాజ్‌ అకాల మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సంతాపం.
– చిరంజీవి
సినీ సంగీత దర్శకుడు రాజ్‌ కన్నుమూశారని తెలిసి చింతించాను. అలనాటి సంగీత దర్శకుడు టి.వి.రాజుగారి వారసుడిగా రాజ్‌ తనదైన బాణీని చూపారు. తన మిత్రుడు కోటితో కలిసి రాజ్‌-కోటి ద్వయంగా చక్కని సంగీతం అందించారు. అన్నయ్య చిరంజీవి నటించిన ‘యముడికి మొగుడు’, ‘ఖైదీనెం.786’, ‘త్రినేత్రుడు’ వంటి తదితర చిత్రాలకు మంచి సంగీతం అందించడంలో రాజ్‌ భాగస్వామ్యం ఎంతో ఉంది.
– పవన్‌కళ్యాణ

Spread the love