బియ్యానికి బదులు గోధుమ రవ్వ…

బియ్యానికి బదులు గోధుమ రవ్వ...తణధాన్యాలను అన్నానికి బదులుగా ఆహారంలో తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. మధుమేహం ఉన్నవారు ఎక్కువగా బ్రౌన్‌ రైస్‌ తీసుకుంటూ ఉంటారు. అలాగే రాత్రి భోజనానికి అన్నం తగ్గించి చపాతీలను, పుల్కాలను తీసుకుంటూ ఉంటారు. గోధుమ రవ్వలో ఫైబర్‌, ప్రొటీన్‌, మాంగనీస్‌, మెగ్నీషియం, ఐరన్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణశక్తి స్థాయిని పెంచుతాయి. దీనిని తీసుకోవడం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుందాం.
బరువు తగ్గేందుకు..
గోధుమ రవ్వలోని అధిక ఫైబర్‌ బరువు పెరగకుండా పనిచేస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది. అతిగా తినడం కంట్రోల్‌ కాగానే బరువు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఇందులోని సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు శక్తిని అందిస్తాయి.
ఎముకల ఆరోగ్యానికి..
గోధుమ రవ్వలో మెగ్నీషియం, భాస్వరం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి. ఇవి ఎముకల దృఢత్వానికి ఎంతో ఉపయోగపడ్తాయి.

Spread the love