కార్మికులందరూ ఏకం కావాలి

– ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వనంపల్లి జైపాల్‌ రెడ్డి
– 138వ మేడేను విజయవంతం చేయండి
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
138వ మేడే వేడుకలు ఘనంగా నిర్వహించడానికి కార్మికులందరూ కలిసి రావాలని ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వనంపల్లి జైపాల్‌ రెడ్డి అన్నారు. శుక్ర వారం మైలార్దేవ్పల్లి చౌరస్తాలో మేడే వాల్‌పోస్టర్‌ను ఆయ న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ..దేశంలో మోడీ వచ్చిన తర్వాత కార్మిక వర్గంపై రైతులపై దాడి చేయడం మొదలుపెట్టాడని పోరాడి సాధించుకున్న 44 రకాల చట్టాలను పెట్టుబడిదారులకు రెడ్‌ కార్పెట్‌ వేస్తూ 4 కోడ్‌లుగా చేసి కార్మికులకు తీవ్ర మైన అన్యాయం చేశాడని ఆయన ఆందోళన వ్యక్తం చేశా రు. గతంలో బీజేపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఆదేశించింది. కానీ అది ఇప్పటివరకు బీజేపీ ప్రభుత్వం అమలు చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో కార్మికులందరూ కలిసి బీజేపీకి తగిన గుణపా ఠం చెప్పాలన్నారు. ఈసారి రంగారెడ్డి జిల్లాలో మేడే వేడు కలు ఘనంగా నిర్వహిస్తున్నామని కార్మికులు విధిగా ప్రతి ఒక్కరూ మేడే వేడుకల్లో పాల్గొనాలన్నారు. కార్యక్రమం లో ఏఐటీయూసీ మండల సహాయ కార్యదర్శి వై సాయి లు, శ్రీను, నరసింహులు, అశోక్‌, మురళి, శంకరమ్మ, శ్యా మలమ్మ, అండాలు, పోచమ్మ తది పాల్గొన్నారు.

Spread the love