బర్త్‌డేకి సర్‌ప్రైజ్‌లు..

బాలకష్ణ, డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న విషయం విదితమే. (ఎన్‌బికె108 వర్కింగ్‌ టైటిల్‌).
షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది భారీ బడ్జెట్‌తో
ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 10న బాలకష్ణ పుట్టినరోజు. ఈ బర్త్‌డే బాలకష్ణ ఫ్యాన్స్‌కి చాలా ప్రత్యేకమైనది కానుంది. ఎందుకంటే ఈ బర్త్‌డేకి చాలా ట్రీట్‌లు ఉన్నాయి. బాలకష్ణ పుట్టినరోజుకి రెండు రోజుల ముందుగా, అంటే ఈనెల 8వ తేదీన ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేయనున్నారు. దీనికోసం పవర్‌ ఫుల్‌ టైటిల్‌ని లాక్‌ చేశారు. అలాగే పవర్‌ ఫుల్‌ ఫస్ట్‌-లుక్‌ పోస్టర్‌ని కూడా రెడీ చేశారు.
ఈనెల 10న బాలకష్ణ పుట్టినరోజు సందర్భంగా పెద్ద సర్‌ప్రైజ్‌ని మేకర్స్‌ ప్లాన్‌ చేశారు.
‘కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. విజయదశమి కానుకగా ఈ సినిమా థియేట్రికల్‌ విడుదలకు సిద్ధమౌతోంది’ అని చిత్ర యూనిట్‌ తెలిపింది.
ఇక బాలయ్య బర్త్‌డే స్పెషల్‌గా ఆయన అభిమానులకు స్పెషల్‌ ట్రీట్‌ కూడా ఉంది. టాలీవుడ్‌లో సంచలన విజయం సాధించి, బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన ‘నరసింహనాయుడు’ చిత్రాన్ని మేకర్స్‌ రీ రిలీజ్‌ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈనెల 9, 10వ తేదీలో ఓవర్సీస్‌ల్లో ఈ సినిమా ప్రదర్శితం కానుండగా, ఈనెల 10న రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో ఈ సినిమా సందడి చేయనుంది. తమ అభిమాన హీరో బర్త్‌డే కానుకగా అఖండ విజయం సాధించిన ‘నరసింహనాయుడు’ చిత్రాన్ని 4కె ఫార్మెట్‌లో చూడబోతున్నందుకు అభిమానులు ఫుల్‌ ఖుషీలో ఉన్నారు. బాలకృష్ణ, బి.గోపాల్‌, మణిశర్మ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా తెలుగునాట ఓ ఊపు ఊపేసింది. మళ్ళీ అదే ఊపు ఇప్పుడు కూడా ఉంటుందనే దీమాని బాలయ్య ఫ్యాన్స్‌ వ్యక్తం చేస్తున్నారు.

Spread the love