అంబ సత్ర భూముల్లో అనుమతి లేకుండా ఇటుక బట్టీలు

– కళ్ళుండి చూడలేని స్థితిలో రెవెన్యూ, పంచాయతీ అధికారులు
– ఫారెస్ట్‌ భూముల్లో ఇటుక అమ్మకం కోసం రహదారులు
– చోద్యం చూస్తున్న ఫారెస్ట్‌ అధికారులు
నవతెలంగాణ-లక్ష్మీదేవి పల్లి
లక్ష్మీదేవి పల్లి మండలంలో శెట్టిపల్లి, కారుకొండ సీతారాంపురం సహా మిగిలిన పంచాయతీల పరిధిలోని సుమారు 5768 ఎకరాల అంబసత్ర భూములు ఉన్నాయి. అంబసత్ర భూములను ఐదువేల కుటుంబాలు సేద్యం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. 1/70 చట్టం అమలులో ఉన్నా చట్టానికి తూట్లు పెట్టి గిరిజనేతరులు అని శెట్టిపల్లి, కారుకొండ గ్రామాలలో యదేచ్చగా ఇటుక బట్టీల వ్యాపారం గత కొన్ని సంవత్సరాల నుండి కొనసాగిస్తున్నారు. అంబసత్ర భూముల్లో కుటుంబ అవసరాల కోసం సేద్యం చేసుకున్నటువంటి భూమిని కొంతమంది ఇటుక బట్టీల కాంట్రాక్టర్లు రైతులకు డబ్బు ఆశ చూపించి వ్యవసాయ భూమిని వారి ప్రయోజనాల కోసం చట్టాలకు తూట్లు పొడిచి వ్యాపార భూములుగా మార్చారు. ఇటుక భట్టీల వ్యవహారం ఇంత పెద్ద ఎత్తున నడుస్తున్న రెవెన్యూ, పంచాయతీ అధికారులు మాత్రం కళ్ళుండి చూడలేని స్థితిలో ఉన్నారంటే అధికారుల కనసన్నల్లోనే ఈ వ్యాపారం కొనసాగుతుందని స్థానికులు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ఇటుక బట్టీల నుండి ఇటుకను ట్రాక్టర్‌ పైన ఫారెస్ట్‌ అధికారుల సహకారంతో ఫారెస్ట్‌ రహదారి నుండి దొడ్డిదారిన ఇటుక అక్రమ రవాణా జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. దీనిపై ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
పంచాయతీ సెక్రెటరీ వివరణ : ఈ విషయంపై పంచాయతీ సెక్రటరీని వివరణ అడగగా పంచాయతీ నుండి రెండుసార్లు నోటీసులు ఇచ్చాము, అయినా వారి నడవడికలో ఎటువంటి మార్పు రాకపోగా ఇటుక బట్టీల అమ్మకాలు కొనసాగిస్తున్నారు.

Spread the love