రెజ్లర్ల అరెస్ట్‌ను ఖండిస్తూ ఎంపీ బ్రీజ్‌ భూషణ్‌ దిష్టిబొమ్మ దహనం

– దేశ ప్రధాని స్పందించకపోవడం సిగ్గుచేటు
నవతెలంగాణ-ఇల్లందు
లైంగికంగా వేధించిన బీజేపీ ఎంపీ, బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను అరెస్టు చేయాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న భారత రెజ్లర్లు సాక్షి మాలిక్‌, బజరంగ్‌ పునియా, వినేష్‌ పొగట్‌లను అత్యంత దారుణంగా ఈడ్చుకెళ్లి అరెస్టు చేయడాన్ని సీపీఐ ఎంఎల్‌ ప్రజాపంధా, ప్రగతిశీల మహిళా సంఘం (పిఓడబ్ల్యూ) తీవ్రంగా ఖండించింది. నిరసనగా కొమరారం గ్రామ గ్రంథాలయం సెంటర్లో దిష్టిబొమ్మ దగ్ధం చేసిశారు. అనంతరం జరిగిన సభకు పీవైఎల్‌ జిల్లా నాయకులు శాంతారావు అధ్యక్షతన పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు ఎదలపల్లి సావిత్రి, కొమరారం ఎంపీటీసీ అజ్మీర బిచ్చ, కొమరారం గ్రామ కార్యదర్శి శంకర్‌లు మాట్లాడారు. లైంగిక వేధింపులకు గురి చేస్తున్న బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేయకుండా, లైంగిక వేధింపులకు గురైన బాధితులని అరెస్టు చేయడం హేయమైన చర్య అని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో బుర్ర రాఘవులు, ఇస్లావత్‌ కోటేష్‌, రాములు, పాషా, సమ్మయ్య, కోరమూతక్క, అజ్మీరా రాంజీ, జగ్గులు, రాములు, కిషన్‌, శాంత తదితరులు పాల్గొన్నారు.

Spread the love