ప్రాధాన్యత సంతరించుకున్న ఎలోన్‌ మస్క్‌ చైనా పర్యటన

బీజింగ్‌ : ట్విట్టర్‌ యజమాని, తెస్లా సీఈఓ ఎలోన్‌ మస్క్‌ ఈవారం చైనాలో పర్యటించారు. ప్రపంచాన్ని గడగడలాడిం చిన కోవిడ్‌-19 మహమ్మారి మొదలైన తర్వాత ఆయన చైనాను దర్శించటం ఇదే తొలిసారి. చైనా ఉప ప్రధాని డింగ్‌ చిజి యాంగ్‌ను కలవటానికి ముందు మస్క్‌ చైనా విదేశాంగ మంత్రి, క్విన్‌ గంగ్‌ను కలిశాడు. ఈ సమా వేశాల్లో షాంగైలో బ్యాటరీ కార్లను ఉత్పత్తి చేస్తున్న తన తెస్లా కార్ల ప్యాక్టరీ గురించి, లిథియం బ్యాటరీ సరఫరా చైన్‌ గురించి మస్క్‌ చర్చించాడు. వాస్తవంలో ఇదంతా వ్యాపార సంబంధితమైనప్పటికీ మస్క్‌ చైనా సందర్శనకున్న రాజకీయ ప్రతీకాత్మకత (సింబా లిజం) ను విస్మరించలేం. మస్క్‌ చైనా పర్యటనపై అక్కడి మీడియా చాలా ప్రాధాన్యతనిచ్చింది. మస్క్‌ వంటి అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం గల వ్యాపారవేత్త తమ నాయకులతో ఎలా కలుపుగోలుగా మాట్లాడుతున్నాడో యావత్‌ ప్రపంచం చూడాలని చైనా కోరుకుంటోంది. ఈ మధ్య కాలంలో చైనా ఏ అమెరికా రాజకీయ నాయకుడికిగానీ, అధికారి కిగానీ ఇటువంటి ఆత్మీయ ఆతిధ్యం ఇచ్చిన దాఖలా లేదు. నిజానికి ఈ సంవత్సర మొదట్లో ”గూఢచార బెలూన్‌” ఘటన జరిగిన తరువాత చైనా, అమెరికాల సంబంధాలు పూర్తిగా ఘనీభవించాయి. దీనర్థం అమెరికాపట్ల చైనా కు ఆసక్తిలేదని కాదు. అమెరికా రాజకీయ నాయకులతో సంప్రదింపులు జరపటంకంటే మస్క్‌ వంటి ఉన్నత స్థాయి వ్యక్తులను ఉపయోగించుకుని ఆచరణీయ అంశాలను ముం దుకుతేవచ్చని చైనా భావిస్తున్నది. ఈ సంవత్సర ఆరంభం లో యాపిల్‌ సీఈఓ, టిమ్‌ కుక్‌ కూడా చైనాలో పర్యటిం చాడు. అమెరికాతో ఎన్ని ఘర్షణలు, ఎంత అనిచ్చితి ఉన్నప్ప టికీ అమెరికా వ్యాపారవేత్తలు చైనా వ్యతిరేకులుగా లేరని చైనా భావిస్తోంది. అమెరికా, చైనా సంబంధాలు మెరుగు పడటానికి చేస్తున్న ప్రయత్నంలో మస్క్‌కు ఇచ్చిన ప్రాధాన్య త అమెరికా రాయబారి, నిఖొలస్‌ బర్న్స్‌ కి ఇవ్వకపోవటం వైచిత్రి.

Spread the love