జిల్లా విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించండి

– ప్రభుత్వ పాఠశాలలో వెంటనే ప్రత్యేక స్కావెంజర్స్‌ ను నియమించాలి
– వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఏఓకు టీఎస్‌యూటీఎఫ్‌ వినతి
నవతెలంగాణ-వికారాబాద్‌ ప్రతినిధి
వికారాబాద్‌ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు వెంటనే స్కావెంజర్లను నియమించాలని, పాఠశాల విద్యాభి వృద్ధికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని టీఎస్‌యూటీఎఫ్‌ వికారాబాద్‌ జిల్లా కమిటీ అధ్యక్షులు సిహెచ్‌ వెంకటరత్నం డిమాండ్‌ చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఏఓకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న అన్ని యాజమాన్యలలో పాఠశాలలకు ఒక్క స్కావెంజర్లు లేకుండా ఉన్నాయని అన్నారు. పాఠశాల తరగతి గదులు, ఆవరణను, మూత్రశాలలను విద్యార్థులు, ఉపాధ్యాయులే శుభ్రం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో గ్రామపంచాయతీ వర్కర్ల ద్వారా పరిశుభ్రం చేయాలని స్ప ష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ గ్రామపంచాయతీలకు నిధుల లేమితో పాఠశాల పారిశుధ్య కార్యక్రమాలు గ్రామపం చాయతీ నిర్వహించే స్థితిలో లేవన్నారు. పాఠశాలల పారిశుధ్యంకు ప్రత్యేకమైన స్కావెంజర్లను నియమించి వారిని కేవలం పాఠశాలకే పరిమితం చేయాలన్నారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పడిన కొత్త జిల్లాలలో వికారాబాద్‌ జిల్లా ఒకటని వికారాబాద్‌ జిల్లా ఏర్పడిన నాటి నుండి నేటి వరకు పాఠశాల విద్యాభివృద్ధికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలు ఏవి రూపొందిం చలేదని అన్నారు. జిల్లా కలెక్టర్‌ వెంటనే స్పందించి ఈ విద్యాసంవత్సరంలోనైనా ప్రభుత్వ పాఠశాల విద్యాభివృద్ధికి ప్రత్యేక యాక్షన్‌ ప్లాన్‌ తయారుచేసి అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ని కోరారు. ఈ కార్యక్రమంలో ధారూర్‌, నవాబ్‌పేట అధ్యక్షులు, జి.రాములు, పి.అజరుకుమార్‌ పాల్గొన్నారు.

Spread the love