నీరులేక ఎండిపోతున్న నారుమడులు

– భూగర్భ జలాలు తగ్గడంతో ఎండిపోతున్న బోర్లు, వరినారు
– పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యపు నీరు
– భూగర్భ జలాలు కలుషితం
– పైరు ఎండిపోవడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు
నవతెలంగాణ-కొందుర్గు
ప్రకృతిలో ముందుగా నష్టపోయేది రైతన్నలే.. ఈదురు గాలులు వీచినా, అధికంగా వర్షాలు కురిసినా, లేదా భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎండినా అన్నదాతలపైనే ప్రభావం పడుతుంది. ఆరుగాలం కష్టపడుతూ, కంటికి కునుకు లేకున్నా, ఇంటిళ్లిపాది పనుల్లో నిమగమై పనులు చేస్తారు. అయినా చేసిన కష్టం ఫలించదు. లాభాల సంగతి పక్కన పెడితే పెట్టిన పెట్టుబడి కూడా రాక పంటలు నష్టపోయి రైతులు ఆదోళన చెందుతున్నారు. పంట పొలాల సమీపంలోనే పరిశ్రమలు ఏర్పడంతో ఆ నీరు భూ గర్భజలాలు కలుషితమై నీరు కూడా ఏర్రగా వస్తుంది. ఈ నీటితో పంటలు పండించలేక, వేసిన బోర్లు ఎండి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు రైతన్నలు.. అయితే ఈ ఏడు వర్షాలు తక్కువ పడటంతో ఎండలు ముదురుతు డటంతో బోర్లలో నీరు అందడం లేదు. భూగర్భ జలాలు అడుగంటి, వేసిన నారు మడులు ఎండి పోతున్నాయి. వేల రూపాయలు ఖర్చు చేసి వ్యవసాయం కోసం అప్పులు చేసి కష్టపడుతున్నా, దిక్కతోచని స్థితిలో ఉన్నారు అన్నదాతలు.
కొందుర్గు మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్‌ రైతు బండమీది పెంటయ్యకు సంబంధించిన ఐదు ఎకరాల పొలంలో వ్యవసాయం చేసు కుంటూ జీవనం సాగి స్తున్నాడు. ఐదె కారాల పొలంలో ఒక ఎకరం పశువులకు మేత పెట్టగా మిగిలిన నాలుగు ఎకరాల్లో వరి నాటువేశారు. మొత్తం పొలంలో మూడు బోర్లు ఉన్నాయి. ఈ మూడు బోర్లలో నీళ్లు సమృద్ధిగా వస్తుండటంతో వరి నారు పోశాడు. నారు నాట్లు వేసుకునే సమయానికి రెండు బోర్లూ ఎండిపోయాయి. మూడోవ బోర్‌ కెమికల్స్‌ కలుషుతం అయ్యి, నీరంతా ఎర్రగా వస్తుంది. ఈ కెమికల్‌ కలుషుతం కావడంతో ఒక్కబోరులో కూడా నీరు అందకపోవడంతో వరినారు పూర్తిగా ఎండిపోయింది. నాలుగు ఎకరాలకుగాను మొదటి సారి నాటేసిన నారు సరిగ్గా ఎదుగలేదు. మళ్లీ ఎనిమిది సంచుల మొలకలు చల్లగా నాలుగు ఎకరాలకు గాను 16 సంచుల వడ్ల మొలక చల్లినా కూడా లాభం లేకపోయింది. చుట్టూ పక్కల ఉన్న పరిశ్రమల నుంచీ వెలువడుతున్న కాలుష్యపు నీటితో అండర్‌ గ్రౌండ్‌ వాటర్‌ పొల్యూషన్‌ అవుతున్నాయి. పరిశ్రమల వలన రైతులకు నష్టం జరుగుతున్నది. అదేవిధంగా భూగర్భ జలాలు కూడా కలుషితం అవుతున్నాయనీ పరిశ్రమల చుట్టూ ఉన్న రైతులు ఆవేదన చెందుతున్నారు. దేశానికి అన్నం పెట్టె రైతులు నేడు దిక్కుతోచని స్థితిలో ఉంటూ, పేదరికం అనుభవిస్తున్నారు. భూమిని నమ్ముకుని జీవనం కొనసాగించే రైతుల అప్పుల పాలు అవుతున్నారు. ఆపద వస్తే, ఆదుకునే వారేలేరంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటడంతో పంటలకు నీరందక ఎండిపోతున్నాయి. ఈ పంటల కోసం చేసిన అప్పులు తీర్చలేక, అప్పులిచ్చిన వ్యక్తికి ఎం సమాధానం చెప్పాలో తోచక ఆగమవుతున్నారు . రైతన్నల జీవితం ప్రశ్నార్థకంగా మారుతోంది.

పరిశ్రమల కలుషిత నీటిని అరికట్టాలి
ఐదెకరాల భూమి ఉండగా ఎకరంలో పశువులకు మేత వదిలి, మిగిలిన నాలుగు ఎకరాలలో వారి నారు పోసిన. ఎండలు ముదరక ముందే రెండు బోర్లు ఎండి పోయాయి. దీంతో నాలుగు ఎకరాల లో వేసిన వరి ఎండి పోయింది. మిగిలిన ఒక్క బోరులో వాటర్‌ తగ్గి కెమికల్‌ వాటర్‌ కాలుష్యపు నీరు చేరి ఎర్రగా వస్తుంది. ఈ నీటిని వ్యవసాయానికి ఉపయోగకరం కాదనీ వదిలేసినం. తమ పొలాల సమీపంలోనే పరి శ్రమలున్నాయి. పరిశ్రమలు వదిలే వ్యర్థపు నీటికాలుష్యంతో భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి. ఈ విషయాన్నీ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా అధికారులు బోరుని పరిశీలించి ,ఆ నీటిని సేకరించి పరీక్షించేందుకు ల్యాబ్‌కు పంపించారు.
– బండమీది పెంటయ్య, రైతు కొందుర్గు మాజీ సర్పంచ్‌

Spread the love