నూతన గృహప్రవేశానికి హాజరైన మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు

నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని మండలంలోని సూరయ్య పల్లె గ్రామములో తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వ్యక్తిగత సహాయకులు (పీఏ) ఆకుల చంద్రశేఖర్ మౌనిక దంపతుల నూతన గృహ ప్రవేశానికి శనివారం ఉదయం హాజరై, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love