26,27 తేదీల్లో హైదరాబాద్‌లో జాతీయ దళిత అజెండా సదస్సు

నవతెలంగాణ – ఢిల్లీ: హైదరాబాద్‌లో జాతీయ దళిత అజెండా సదస్సును ఆగస్టు 26,27 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బీ వెంకట్ తెలిపారు.ఈ సదస్సుకు 100కు పైగా దళిత సంఘాలు హాజరవుతాయని తెలిపారు.ఈ సదస్సు టూరిస్టు ప్లాజాలో జరగనున్నదని చెప్పారు.దళిత సంఘాల నేతలు, దళితుల కోసం పనిచేసే సంఘాలు ఈ సదస్సులో పాల్గొంటాయన్నారు. రాజ్యాంగం దళితులకు ఇచ్చిన హక్కులు ఎలా అమలు అవుతున్నాయి దళితుల అజెండాపై చర్చ జరుగుతుందన్నారు.ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో దళితులకు జరుగుతున్న నష్టం పైనా చర్చ జరుగుతుందని చెప్పారు. దళితులకు భుమూల అంశం పైనా చర్చ జరుగుతుంది.దేశంలో 40 కోట్ల ఎకరాల సాగు భూమి ఉన్న దళితులకు తక్కువ స్థాయిలో వ్యవసాయ భూమి ఉందన్నారు.బీజేపీ పాలనలో పౌర హక్కుల అమలు కావడం లేదని మండిపడ్డారు.దళితులపై దాడుల గురుంచి వాటిని అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అజెండా రూపొందిస్తామని వెంకట్ తెలిపారు.

Spread the love