రన్నరప్‌ కిరాక్‌ హైదరాబాద్‌

– ఫైనల్లో పోరాడి ఓడిన తెలుగు జట్టు
– ప్రొ పంజా లీగ్‌ తొలి సీజన్‌ విజేతగా కొచి కెడిస్‌
న్యూఢిల్లీ : ప్రొ పంజా లీగ్‌ (ఆర్మ్‌ రెజ్లింగ్‌) మొదటి సీజన్‌లో తెలుగు రాష్రాల జట్టు కిరాక్‌ హైదరాబాద్‌ రన్నరప్‌ గా నిలిచింది. లీగ్‌ దశతో పాటు సెమీఫైనల్లో అద్భుత ఆటతీరు కనబరిచిన హైదరాబాద్‌ ఫైనల్లో టై బ్రేకర్‌లో పట్టు విడిచింది. ఆదివారం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియంలో అత్యంత హౌరాహౌరీగా జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో కిరాక్‌ హైదరాబాద్‌ 28-30 తేడాతో కొచి కెడిస్‌ చేతిలో పోరాడి ఓడిపోయింది. అండర్‌ కార్డు, మెయిన్‌ కార్డు మ్యాచ్‌ల తర్వాత ఇరు జట్లూ సమంగా నిలిచాయి. టై బ్రేకర్‌ లో సత్తా చాటిన కొచ్చి తొలి సీజన్‌ ట్రోఫీ సొంతం చేసుకుంది. సీజన్‌ లో అద్భుతంగా పోరాడి రన్నరప్‌ గా నిలిచిన హైదరాబాద్‌ ఆర్మ్‌ రెజ్లర్లను ప్రాంఛైజీ యజమానికి నెదురుమల్లి గౌతం రెడ్డి, సీఈవో త్రినాథ్‌ రెడ్డి అభినందించారు.

Spread the love