ఎమ్మెల్యేకు ఘన స్వాగతం బైకు కార్ల ర్యాలీ

నవతెలంగాణ- మద్నూర్

జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు సిండే జన్మదిన వేడుకలు సోమవారం నాడు మద్నూర్ మండల కేంద్రంలోని గురు ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యేకు జన్మదిన వేడుకల్లో సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అధికారులు విద్యార్థిని విద్యార్థులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు బన్సీ పటేల్ మాట్లాడుతూ జుక్కల్ అభివృద్ధి ప్రదాత ప్రజా సమస్యల పరిష్కార ముద్దుబిడ్డ హనుమంతు షిండే జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధికి అందించే కృషిని కొనియాడారు ఎమ్మెల్యేకు కలిసి సన్మానాలు చేస్తూ జన్మదిన వేడుకల శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love