చంద్రయాన్‌ 1 నుంచి నేటి దాకా….

చంద్రుడుపైకి భారత్‌ పంపిన తొలి మిషన్‌ చంద్రయాన్‌ వన్‌ 2008లో పూర్తయింది. ఖర్చు రూ.386 కోట్లు. చంద్రయాన్‌-2 ప్రయోగం కోసం రూ.978 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు చంద్రయాన్‌-3కి రూ.615 కోట్లు ఖర్చు అయింది,.
జులై 6: చంద్రయాన్‌-3ని జులై 14న శ్రీహరికోటలో లాంచ్‌ ప్యాడ్‌-2 నుంచి ప్రయోగించబోతున్నట్లు ఇస్రో ప్రకటించింది.
ఎన్నిసార్లు కక్ష్యను పెంచారు?
భూమి చుట్టూ తిరిగేటప్పుడు ఐదుసార్లు చంద్రయాన్‌-3 వ్యోమనౌక కక్ష్యను శాస్త్రవేత్తలు పెంచారు.
జులై 15: తొలిసారి కక్ష్యను పెంచారు.
జులై17: రెండోసారి చంద్రయాన్‌-3 ఎత్తును పెంచుతూ కక్ష్యను మార్చారు.
జులై 18: మూడోసారి ఎత్తును పెంచుతూ కక్ష్యను మార్చారు.
జులై 20: నాలుగోసారి చంద్రయాన్‌-3 కక్ష్యను మార్చారు.
జులై 25: చివరిసారిగా ఐదోసారి కక్ష్యను పెంచారు.
చంద్రుడి వైపు పయనం ఎప్పుడు మొదలైంది?
ఆగస్టు 1: భూమి చుట్టు తిరిగే చంద్రయాన్‌-3 రాత్రి 1 గంట సమయంలో చంద్రుడి వైపుగా పయనం మొదలుపెట్టింది.
ఆగస్టు 5: విజయవంతంగా దీన్ని చంద్రుడి కక్ష్యలోకి పంపించారు.
164 కి.మీ. ఞ 18074 కీ.మీ. దగ్గర దీన్ని చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
8 ఆగస్టు 6: చంద్రుడికి దగ్గరగా వెళ్లేందుకు మరోసారి కక్ష్యను తగ్గించారు. దీర్ఘవత్తాకార కక్ష్యలో 170 కి.మీ ఞ 4313 కి.మీ. దగ్గర ప్రవేశపెట్టారు.
8 ఆగస్టు 9: చంద్రయాన్‌-3ను 174 కి.మీ 1437 కి.మీ. దగ్గర కక్ష్య మార్చారు.
8 ఆగస్టు 14: చంద్రయాన్‌-3ను 151 కి.మీ. 179 కి.మీ. దగ్గర కక్ష్య మార్చారు.
8 ఆగస్టు 16: చంద్రయాన్‌-3ను 153 కి.మీ. 163 కి.మీ. దగ్గర కక్ష్య మార్చారు.
ల్యాండర్‌ వేరుపడిందిలా
ఆగస్టు 17: చంద్రయాన్‌-3 బూస్టర్‌ నుంచి విక్రమ్‌ ల్యాండర్‌ విజవంతంగా వేరుపడింది.
ఆగస్టు 19: విక్రమ ల్యాండర్‌ దీర్ఘవత్తాకార కక్ష్యలో చంద్రుడి చుట్టూ తిరగడం మొదలుపెట్టింది.
ఆగస్టు 20: విక్రమ్‌ ల్యాండర్‌ కక్ష్యను తగ్గించి 25 కి.మీ. × 134 కి.మీ. వద్ద కక్ష్య మార్చారు.
ఆగస్టు 23: చంద్రుడి ఉపరితలంపై విక్రమ్‌ సాఫ్ట్‌ ల్యాండ్‌ అయింది.
చంద్రుడిపై విక్రమ్‌ ల్యాండర్‌ ఏం చేస్తుంది?
చంద్రుడి దక్షిణ ధ్రువం దగ్గర 70 డిగ్రీల అక్షాంశం వద్ద విక్రమ్‌ ల్యాండ్‌ అయ్యింది. అక్కడ కొన్ని పరిశోధనలను విక్రమ్‌ చేపడుతుంది.
చంద్రుడి ఉపరితలంపై ఎలాంటి మార్పులు చేసుకుంటున్నాయి? ఇక్కడ ఎలాంటి ఖనిజాలు లభ్యమవుతాయి లాంటి వివరాలను విక్రమ్‌ సేకరిస్తుంది.
భూమి తరహాలో చంద్రుడిపైనా ప్రకంపనలు వస్తున్నాయో లేదో కూడా డేటా సేకరిస్తుంది.
విక్రమ్‌ ల్యాండర్‌ కిందకు దిగిన తర్వాత దాని నుంచి రోవర్‌ బయటకు వస్తుంది. ఇది చంద్రుడిపై మట్టి నమూనాలను పరీక్షిస్తుంది. సంబంధిత వివరాలను శాస్త్రవేత్తలకు పంపిస్తుంది.

Spread the love